హైదరాబాద్ Civils : ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో బ్యూరోక్రసీ (Bureaucracy) పాత్ర కీలకమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సివిల్స్ లో తెలంగాణ నుంచి అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఎంపికవ్వాలనీ సూచిం చారు. హైదరాబాద్లో సోమవారం సింగరేణి -ఆధ్వర్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆయన సివిల్స్ మెయిన్స్కు ఎంపికైన 178 -మందికి లక్ష రూపాయలు చొప్పున అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవ వనరులు -అతి ముఖ్యమైనవి, వాటిని సానబట్టి వజ్రాలుగా -తయారు చేస్తే సమాజానికి పెద్ద ఎత్తున ఉపయో గపడతారన్నారు. సివిల్స్ సిద్ధమవుతున్న అభ్య -ర్థులకు అన్ని విధాలుగా సహకరించేందుకు ప్రభు త్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అభ్య -ర్థులకు మనోధైర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభు త్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పారు. అలాగే సివిల్స్ ఇంటర్వ్యూకి ఎంపికైన వారికి కూడా లక్ష ఆర్థిక సాయంతో పాటు, ఢిల్లీలో – వసతులు కల్పిస్తాం అని హామీ ఇచ్చారు. మొదటి సంవత్సరం 148 మందికి ఆర్థిక సహాయం అందించగా, వీరిలో 10 మంది సివిల్ సర్వీస్ కి ఎంపికయ్యారన్నారు. ప్రజల జీవన స్థితిగతులు మార్చడానికి సివిల్ సర్వీసెస్ ద్వారా అవకాశ ముంటుందని తెలిపారు. నిబద్ధత సేవలందిస్తే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. రాష్ట్ర, కేంద్ర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిస్థాయిలో ప్రజలకు చేరవేస్తేనే ఆశించిన లక్ష్యాలు నెరవేరుతాయి అన్నారు. అధికారుల్లో చిత్తశుద్ధి లోపిస్తే ప్రభుత్వ లక్ష్యాలు ఎంత గొప్పగా ఉన్నా ఫలితం (Result) ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, సింగరేణి సిఎండి బలరామ్ తదితరులు పాల్గొన్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :