తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతుల కోసం వానలు కురిసే శుభవార్తను వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ ఏడాది జూన్ నెలలో మోస్తరు వర్షాలు పడగా, ప్రస్తుతం జూలై మొదటి వారం నుంచే వర్షాకాలం తన ప్రభావాన్ని చూపించబోతోంది. రాబోయే ఐదు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy to very heavy rains) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. రైతులు మొలకెత్తిన పంటల సాగు ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూల సమయం.

ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌లతో జాగ్రత్త చర్యలు
సోమవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు (Rain Alert) కురుస్తాయని, మంగళవారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ (Orange and yellow alerts issued) చేసింది.
వర్ష సూచనలు (తేదీల వారీగా):
జూలై 7 (సోమవారం): ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.
జూలై 8 (మంగళవారం): మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
జూలై 9 (బుధవారం):
అధికంగా వర్షాలు కురిసే జిల్లాలు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని చెప్పింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ విభాగం పేర్కొంది.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
మరోవైపు ఆదివారం (జులై 6) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసినట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది.
Read also: Revanth Reddy: వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్