గతవారం రోజుల నుంచి తెలుగురాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు (Rain Alert) కురుస్తున్నాయి. బంగాళఖాతం (Bay of Bengal) లో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో మరో మూడురోజులు రెండుతెలుగు రాష్ట్రాలకు భారీవర్షాలు (Rain Alert) కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ప్రత్యేకంగా నేడు తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇతర చోట్ల ఓ మోస్తరు వర్షం కురిసే ఛాన్స్ ఉంది.

పైజిల్లాలకు ఎల్లో అలర్డ్ను (Yellow Alert) హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడం మంచిదని అధికారులు అంటున్నారు. ప్రత్యేకంగా పిల్లలు, వృద్ధులు ఈ సీజన్లో లో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. రోడ్లపై నడుస్తున్నప్పుడు మ్యాన్ హోల్స్ పై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మేనెలల కురిసిన వర్షాలు జూన్, జులై మూడోవారం వరకు వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళనతో ఎదురుచూసారు. ప్రస్తుతం
రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడం హర్షణీయమని రైతులు అంటున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Phone tapping: కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ నిందితులను వదలం: ఆది శ్రీనివాస్