हिन्दी | Epaper
గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’

Telangana: కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్?

Aanusha
Telangana: కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్?

తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు తీపి కబురు. రాష్ట్రంలో దాదాపు 14 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడించారు. చాలా కాలంగా నోటిఫికేషన్ కోసం నిరీక్షిస్తున్న వేలాది మంది అభ్యర్థుల్లో ఈ ప్రకటన కొత్త ఆశలు చిగురింపజేసింది. మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో.. ‘తెలంగాణ నేర వార్షిక నివేదిక-2025’ను విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. డీజీపీ ప్రకటనతో త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందని నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Telangana: మందుబాబులకు బంపర్ ఆఫర్?

ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పటివరకు మూడు విడతలుగా (2016, 2018, 2022) పోలీసు నియామకాలు జరిగాయి. అయితే 2023 నుంచి రిక్రూట్‌మెంట్‌లో జాప్యం జరుగుతుండటంతో ప్రభుత్వంపై నిరుద్యోగులు ఒత్తిడి తెస్తున్నారు. లక్షలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోతుందన్న ఆందోళనలో ఉన్న తరుణంలో డీజీపీ ప్రకటన వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

శాఖలో ఏటా పదవీ విరమణలు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటం, కొత్తగా సిబ్బంది తోడవకపోవడంతో ప్రస్తుతం ఉన్న పోలీసులపై పనిభారం రెట్టింపైంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు ఇస్తేనే సిబ్బంది సంఖ్య సమతుల్యంగా ఉంటుందని పోలీసు సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో సిబ్బంది కొరతను అధిగమించి, క్షేత్రస్థాయిలో పనితీరును మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870