తెలంగాణలో మహిళా శక్తికి మరింత బలాన్నిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సెర్చ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మినీ గోడౌన్లను డ్వాక్రా మహిళలకు (telangana dwakra group) అప్పగించేందుకు యోచన జరుగుతోంది. ఇది గ్రామీణ మహిళా సంఘాల ఆర్థిక స్థిరత్వానికి దోహదపడే మార్గంగా భావిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం దీనిపై సన్నాహాలు ప్రారంభించింది.
100 మినీ గోడౌన్ల బాధ్యత డ్వాక్రా మహిళలకు
మొత్తం 184 మినీ గోడౌన్లు రాష్ట్రంలో నిర్మాణంలో ఉండగా, మొదటి విడతలో 100 గోడౌన్ల బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించనున్నట్లు సమాచారం. దీనిద్వారా మహిళా సంఘాలు ఆ గోడౌన్ల నిర్వహణతో పాటు తక్కువ అద్దెకు నిల్వ సదుపాయాలను ఇతర సంఘాలకు లేదా వ్యాపారులకు ఇవ్వగలుగుతాయి. ఇది వారికి స్థిర ఆదాయాన్ని కలిగించే అవకాశంగా కూడా కనిపిస్తోంది.
నిర్మాణానికి ప్రణాళికలు పూర్తి దశలో
ఇప్పటికే మండల కేంద్రాల్లో అనువైన ప్రదేశాలను గుర్తించి పరిశీలనలు ప్రారంభించాయి. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) తయారీ బాధ్యతను నాబ్‌కిసాన్ సంస్థకు అప్పగించారు. వీటి నిర్మాణం పూర్తయిన తర్వాత డ్వాక్రా మహిళల సహకారంతో నిర్వహణ చేపడతారని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఈ చర్యలతో గ్రామీణ ప్రాంతాల్లో మహిళా శక్తి మరింతగా బలపడే అవకాశముంది.
Read Also : Rains : నేడు ఏపీ వ్యాప్తంగా వర్షాలు