हिन्दी | Epaper

Telangana: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స

Pooja
Telangana: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నగదు రహిత చికిత్స పథకాన్ని తెలంగాణలో(Telangana) అమలు చేయడానికి ఆరోగ్యశ్రీ ట్రస్టు చర్యలు చేపడుతోంది. ఈ పథకం కింద బాధితులకు గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా వైద్య సేవలు అందించనున్నారు.

Read Also: Computer Didi Scheme: డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు

Telangana
Telangana

కార్డులు లేకున్నా వర్తించే పథకం

ఆరోగ్యశ్రీ లేదా ఆయుష్మాన్ భారత్ కార్డులు లేని వారికి కూడా ఈ సౌకర్యం వర్తించనుండటం ఈ పథకంలోని ప్రధాన విశేషం. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి చేరిన బాధితులకు ఎలాంటి ఆర్థిక అడ్డంకులు లేకుండా చికిత్స అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించారు.

ప్రమాద ప్రాంతాల్లో నెట్‌వర్క్ ఆసుపత్రులు

ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు(Telangana) సంభవించే ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులను గుర్తించి, వాటిని ఈ పథకం నెట్‌వర్క్‌లోకి తీసుకురానున్నారు. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో బాధితులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే అవకాశం మెరుగవుతుందని అధికారులు భావిస్తున్నారు.

మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ నుంచి నిధులు

ఈ పథకానికి కావాల్సిన నిధులను మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ నుంచి విడుదల చేయనున్నారు. ఇప్పటికే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఈ పథకం ప్రయోగాత్మకంగా అమలులోకి వచ్చి, వేలాది మంది ప్రమాద బాధితులకు ఉపయోగపడినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ పథకం వర్తించాలంటే ప్రమాదం జరిగిన 24 గంటల లోపే ఈడార్ (eDAR) నమోదు చేయడం తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు. ఈ నిబంధన పాటిస్తేనే నగదు రహిత చికిత్స సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

అడవిలో ఏఐ నిఘా నేత్రాలు..నిరంతరం గస్తీ

అడవిలో ఏఐ నిఘా నేత్రాలు..నిరంతరం గస్తీ

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

హైదరాబాద్​లో అద్దె​కు కూలర్లు

హైదరాబాద్​లో అద్దె​కు కూలర్లు

తోమాహాక్ క్షిప‌ణియే ఇరాన్ బాలిక‌ల స్కూల్‌పై ప‌డింది

తోమాహాక్ క్షిప‌ణియే ఇరాన్ బాలిక‌ల స్కూల్‌పై ప‌డింది

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

📢 For Advertisement Booking: 98481 12870