తెలంగాణ (Telangana) లో బతుకమ్మ పండుగ (Bathukamma Festival) సందర్భంగా రాష్ట్ర మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేయాలన్న వార్త అందరికీ తెలిసిన అంశం. ఈ కార్యక్రమాన్ని “ఇందిరా మహిళా శక్తి” పేరుతో నిర్వహించాలని ప్రణాళిక వేయబడింది. అయితే ప్రారంభంలో కొన్ని సాంకేతిక, లాజిస్టికల్ కారణాల వల్ల చీరల పంపిణీ (Distribution of sarees) ని వాయిదా వేయడం జరిగింది.
Read Also: Natural disasters: ప్రకృతి వైపరీత్యాలే ప్రపంచ సవాళ్లు
పండుగ సందర్భంగా కార్యక్రమం సజావుగా నిర్వహించడంలో అవాంతరాలు ఎదురైనందున, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పండుగ తర్వాత చేపట్టాలని నిర్ణయించింది.ఈ వాయిదా తర్వాత, చీరల పంపిణీని ప్రత్యేక సందర్భంగా, దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతి (Indira Gandhi Jayanti) (నవంబర్ 19) రోజున ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం మహిళలపై ప్రత్యేక శ్రద్ధను చూపించేలా, రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశించింది.
పంపిణీ కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేపట్టబడుతున్నాయి. జిల్లా, మున్సిపల్, గ్రామ స్థాయిలో వివిధ అధికార సంస్థలతో సమన్వయం కొనసాగుతోంది.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18,848 స్వయం సహాయకం బృందాల్లో (ఎస్‌హెచ్‌జీ).. 1.94లక్షల మంది సభ్యులు ఉన్నారు.

అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేపట్టబడుతున్నాయి
ఈ గ్రూపుల్లో ఉన్న వారందరికీ.. ఒక్కో చీర (Saree) చొప్పున ప్రభుత్వం పంపిణీ చేయనుంది. అంటే మొత్తం 1.94 లక్షల చీరలు అవసరం అవుతాయన్నమాట. అయితే ఇందులో జిల్లాలకు 50 శాతం చీరలు మాత్రమే సరఫరా అయ్యాయి. వాటిని గోదాముల్లో భద్రపరిచారు. మిగతా 50 శాతం చీరలు త్వరలో జిల్లాలకు సరఫరా కానున్నాయి.
సెర్ప్, మెప్మా వంటి మహిళా సంఘాలకు నాయకత్వం వహించే సంస్థలు ఈ ఉచిత చీరలను పంపిణీ చేయనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సెర్ప్ (Serp) ఆధ్వర్యంలో.. అర్బన్ ప్రాంతాల్లో మెప్మా ఆధ్వర్యంలో మహిళలకు చీరలు అందించనున్నారు.
రెండు రకాలుగా ఈ చీరలను అందించనున్నారు
రెండు రకాలుగా ఈ చీరలను అందించనున్నారు. యవ, మధ్య వయస్కులకు 6.5 మీటర్లు, వృద్ధుల కోసం 9 మీటర్ల చీరలను పంపిణీ చేయనున్నారు. కాగా, చీరల నాణ్యత విషయంలో ఆరోపణలకు అవకాశం లేకుండా.. సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో మగ్గాలపై తయారు చేయించి.. పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఒక్కోటి రూ. 800 విలువ గల చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: