हिन्दी | Epaper

Telangana: 15 ఏళ్ల అమ్మాయిలకు ఉచితంగా HPV వ్యాక్సిన్

Anusha
Telangana: 15 ఏళ్ల అమ్మాయిలకు ఉచితంగా HPV వ్యాక్సిన్

మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ (Telangana) ప్రభుత్వం కీలకమైన,నిర్ణయం తీసుకుంది. భవిష్యత్‌లో మహిళలను ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించాలనే లక్ష్యంతో 14 నుంచి 15 ఏళ్ల వయసున్న బాలికలకు ఉచితంగా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అందించేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వంతో కలిసి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం విశేషం. ఈ వయసున్న బాలికలు రాష్ట్రంలో 4 .60 లక్షల మంది వరకు ఉంటారని అంచనా. వ్యాక్సినేషన్ చేపట్టడానికి ముందు మైక్రో ప్లానింగ్ సర్వే నిర్వహించనున్నారు.

Read Also: Municipal elections results : కరీంనగర్, నిజామాబాద్ మేయర్ పీఠం, ఎవరికీ?

సర్వైకల్ క్యాన్సర్‌ను సమర్థవంతంగా అడ్డుకోవచ్చు

దీని ద్వారా ఈ వయసున్న అమ్మాయిలు స్కూళ్లలో ఎంత మంది ఉన్నారు, బయట ఎంత మంది ఉన్నారనే వివరాలను సమగ్రంగా సేకరిస్తారు.తెలంగాణలోని క్యాన్సర్ కేసులను పరిశీలిస్తే.. మహిళల్లో ఎక్కువ మంది రొమ్ము క్యాన్సర్ బారిన పడుతుండగా.. ఆ తర్వాతి స్థానంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఉంది. దీన్నే సర్వైకల్ క్యాన్సర్ అని పిలుస్తారు. హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్‌ను సమర్థవంతంగా అడ్డుకోవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. మహిళలకు సోకే సర్వైకల్ క్యాన్సర్లలో 85 నుంచి 90 శాతం హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) వల్లే సోకుతోంది. ఎక్కువసార్లు ప్రసవాలు,

Telangana: Free HPV vaccine for 15-year-old girls
Telangana: Free HPV vaccine for 15-year-old girls

వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం, చిన్న వయసులోనే పెళ్లి కావడం, లైంగిక సంబంధాల వల్ల హ్యూమన్ పాపిలోమా వైరస్ సోకుతుంది. అయితే ఇది సోకిన వెంటనే క్యాన్సర్ రాదు. వైరస్ సోకిన 10-15 ఏళ్ల తర్వాత మహిళల్లో క్యాన్సర్‌ బయటపడుతుంది. దీంతో అమ్మాయిలు యుక్త వయసులోకి వచ్చిన తర్వాత, లైంగిక జీవితాన్ని ప్రారంభించడానికి ముందు హెచ్‌పీవీ టీకాలు వేయిస్తే.. క్యాన్సర్‌ను అరికట్టడంలో మంచి ఫలితం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వాగ్దానాలు అమలు చేయకుండా మోసగించిన కెసిఆర్

వాగ్దానాలు అమలు చేయకుండా మోసగించిన కెసిఆర్

హుజురాబాద్ సమగ్ర అభివృద్ధికి చర్యలు

హుజురాబాద్ సమగ్ర అభివృద్ధికి చర్యలు

కొత్త గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం
0:51

కొత్త గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం

డాక్టర్ నమ్రత కుటుంబం రూ. 50 కోట్ల ఆస్తులు జప్తు

డాక్టర్ నమ్రత కుటుంబం రూ. 50 కోట్ల ఆస్తులు జప్తు

రాహుల్ గాంధీకి సొంత ఇల్లు లేదు

రాహుల్ గాంధీకి సొంత ఇల్లు లేదు

పర్యాటక అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

పర్యాటక అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం..హైదరాబాద్‌లో దోశ, పూరి, వడ బంద్!

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం..హైదరాబాద్‌లో దోశ, పూరి, వడ బంద్!

ఆయిల్ పామ్ సాగులో మరింత అభివృద్ధి

ఆయిల్ పామ్ సాగులో మరింత అభివృద్ధి

వెలుగుమట్ల వివాదం.. ఎక్కడ కూల్చారో అక్కడే వారికి ఇళ్లు

వెలుగుమట్ల వివాదం.. ఎక్కడ కూల్చారో అక్కడే వారికి ఇళ్లు

హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు

హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు

గ్యాస్ కొరతతో అవస్థలు పడుతున్న విద్యార్థులు

గ్యాస్ కొరతతో అవస్థలు పడుతున్న విద్యార్థులు

చదువు చెప్పే గురువే కసాయిలా మారితే ఇక పిల్లలకు దిక్కెవరు? సంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన

చదువు చెప్పే గురువే కసాయిలా మారితే ఇక పిల్లలకు దిక్కెవరు? సంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన

📢 For Advertisement Booking: 98481 12870