
తెలంగాణ (Telangana) లో అమలవుతున్న గృహ జ్యోతి పథకం ద్వారా కోట్లాది కుటుంబాలకు గణనీయమైన ఊరట లభిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ పథకం కింద ప్రస్తుతం 52.82 లక్షల కుటుంబాలు ప్రతి నెలా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లబ్ధిని పొందుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. లబ్ధిదారుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.3,593.17 కోట్లు విద్యుత్ సంస్థలకు చెల్లించిందని శాసనమండలిలో పేర్కొన్నారు. SPDCL పరిధిలో 25,35,560 కుటుంబాలు, ఎన్పీడీసీఎల్ పరిధిలో 27,46,938 కుటుంబాలు లబ్ధిపొందుతున్నట్లు తెలిపారు.
Read also: Kalwakurthy: భర్త మరణాన్ని తట్టుకోలేక పిల్లలతో సహా భార్య ఆత్మహత్య
గృహ జ్యోతి పథకం గురించి
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం గృహజ్యోతి పేరుతో ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు విద్యుత్ ను ఉచితంగా అందిస్తోంది. ఈ పరిమితి కంటే ఒక్క యూనిట్ ఎక్కువైనా మొత్తం బిల్లు చెల్లించాల్సిందే. ప్రతీ కుటుంబం నెలవారీ విద్యుత్ వినియోగం 200 యూనిట్ల కంటే తక్కువ ఉన్న వారే ఈ పథకం కింద ఉచిత విద్యుత్ పొందవచ్చు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: