Hyderabad Offices: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఏపీ(Andhra Pradesh)కి చెందిన ప్రభుత్వ కార్యాలయాలు విజయవాడకు తరలించడంతో హైదరాబాద్‌లోని అనేక ప్రభుత్వ భవనాలు ఖాళీగా ఉన్నాయి. అయితే, తెలంగాణ(Telangana)కు చెందిన కొన్ని ప్రభుత్వ శాఖలు ఇప్పటికీ ప్రైవేట్ అద్దె భవనాల్లోనే పనిచేస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వానికి అనవసర ఆర్థిక భారం ఏర్పడుతోంది.
Read Also: VB-G RAM G: ఇక వ్యవసాయంలో కూలీల కొరత ఉండదు!

ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అద్దె భవనాల్లో కొనసాగుతున్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల(Government offices)ను వెంటనే ప్రభుత్వ భవనాలకు మార్చాలని ఆదేశిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. ఈ నెలాఖరులోగా ప్రైవేట్ భవనాలను ఖాళీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
పరిశ్రమ్ భవన్, బీఆర్కే భవన్‌లకు కార్యాలయాలు తరలింపు నిర్ణయం
అలాగే, ఫిబ్రవరి 1 నుంచి అద్దె చెల్లింపులను నిలిపివేయాలని ట్రెజరీ విభాగానికి సూచించింది. పరిశ్రమ్ భవన్, గగన్ విహార్ కాంప్లెక్స్(Gagan Vihar Complex), బీఆర్కే భవన్, ఎర్రమంజిల్ వంటి ప్రభుత్వ భవనాలను పరిశీలించి, తమ కార్యాలయాలను అక్కడికి తరలించేందుకు తక్షణ ఏర్పాట్లు చేయాలని అన్ని శాఖల ప్రత్యేక కార్యదర్శులు, సీఎస్‌లు, ఉన్నతాధికారులకు ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. జనవరి 1 నుంచి తప్పనిసరిగా ప్రభుత్వ భవనాల్లోనే కార్యాలయాలు పనిచేయాలన్నది ప్రభుత్వ స్పష్టమైన ఆదేశంగా పేర్కొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: