కొహెడ గ్రామంలో వరుస ఆత్మహత్యలు
రంగారెడ్డి జిల్లా(Rangareddy District) కొహెడ గ్రామంలో చోటుచేసుకున్న వరుస ఆత్మహత్యలు(Telangana crime) స్థానికులను షాక్‌కు గురి చేశాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన గ్యార శివరాజు కుమార్తె వైష్ణవి (18) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతూ వచ్చింది. ఆమెను వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకెళ్లాలని తల్లిదండ్రులు నిర్ణయించగా, స్నానం చేస్తాను అంటూ బెడ్‌రూమ్‌లోకి వెళ్లి తలుపు మూసుకుంది. కొంతసేపటి తర్వాత తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తలుపు పగులగొట్టి చూసే సరికి వైష్ణవి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆమెను మృతిగా ప్రకటించారు.
Read also: స్వేచ్ఛా హక్కులపై ఐరాస సూచన.. భారత్ స్పందన

స్నేహితుల వరుస మరణాలతో గ్రామంలో కలకలం
వైష్ణవి మృతి వార్త(Telangana crime) గ్రామమంతా వ్యాపించగా, ఆమె క్లాస్‌మేట్ సతాలీ రాకేష్ (21) కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం రాత్రి ఇంటి సమీపంలోని ఓ షట్టర్ రూమ్‌లో బెడ్‌షీట్ తీసుకెళ్లి ఉరివేసుకున్నాడు. గురువారం ఉదయం తల్లి యాదమ్మ చూసేసరికి రాకేష్ మృతి చెందినట్లు తెలిసింది.
అంతేకాక, రాకేష్ మృతదేహాన్ని చూసిన వారి స్నేహితురాలు బుద్ద నర్సింహ కుమార్తె శ్రీజ (18) కూడా తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లోకి వెళ్లి తలుపు మూసుకొని ఉరివేసుకుంది. ఈ ఘటనలను గమనించిన గ్రామస్థులు ముగ్గురు చిన్ననాటి స్నేహితుల వరుస మరణాలతో దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: