Telangana: హైబ్రిడ్ యాన్యుటీ మాడల్లో రోడ్ల ప్రాజెక్టు కింద రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపకపోవడంతో ప్రభుత్వం మల్లాగుల్లాలు పడుతుండగా కాంట్రాక్టర్లు మాత్రం ప్రభుత్వం లెటర్ ఆఫ్ క్రెడిట్ తోపాటు బ్యాంకు కౌంటర్ గ్యారెంటీ ఇస్తే ఆలోచిద్దామని భావిస్తున్నారు. ఆర్అండ్ సర్కిల్స్ వారిగా 32 పాకేజిల్లో 5,824కిమీ నిడివి కలిగిన 419 రోడ్లకోసం టెండర్లను డిసెంబరు 12 షెడ్యూల్ దాఖలుకు తుదిగడువుతో టెండరు ఆహ్వానించారు. ప్రభుత్వం రోడ్డు నిర్మాణదశలో బిడ్ ప్రాజెక్టు కాస్ట్ 40శాతం మంజూరు చేస్తుంది. కాంట్రాక్టరు మిగితా 60శాతం నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది.
Read Also: Sarpanch Rights : సర్పంచుల హక్కులకోసం ప్రతి జిల్లాలో లీగల్ సెల్ – KTR
కౌంటర్ గ్యారెంటీ ఇస్తేనే హ్యామ్ రోడ్ల పనులు
రోడ్ల నిర్మాణాన్ని ఏకకాలంలో చేపట్టడం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందన్న ఉద్దేశంతో కాంట్రాక్టర్లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని రహదారులు నిర్మించేలా ఈ విధానాన్ని రూపొందించారు. కాంట్రాక్టరు తీసుకొనే 60శాతం రుణం పేచీగా మారింది. ఈ నిధులకు వడ్డీతో కలిపి 15 సంవత్సరాలు 30 వాయిదాలలో ప్రభుత్వం కాంట్రాక్టరుకు చెల్లిస్తుంది. ప్రభుత్వం వాయిదా పద్ధతిలో చేసే చెల్లింపుల్లో జాప్యం జరిగితే కాంట్రాక్టరు మూడునెలలలోనే ఎన్పిఎలో పడిపోయే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం కౌంటర్ గ్యారెంటీ ఇస్తే కొంత మంది కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉంది. కాంట్రాక్టర్ల నెట్వర్త్, వారి రుణాల బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకొచ్చే పరిస్థితులు ఉంటాయని కాంట్రాక్టర్లు అంటున్నారు.

15 యేళ్లలో ఏడవ సంవత్సరం రెండ సంవత్సరం మొత్తం మూలధనంలో 2.4శాతం చొప్పున బిటి రోడ్డు మార్పుకు నిర్వహణ కోసం నిధులు ప్రభుత్వం ఇస్తుంది. 2వ సంవత్సరం నుంచి 7వ సంవత్సరం వరకు 0.4 శాతం రోడ్డు నిర్వహణకు నిధులు ప్రభుత్వం కాంట్రాక్టరు ఇస్తుంది. ఎనిమిదవ సంవత్సరం నుంచి 15వ సంవత్సరం వరకు 0.8శాతం నిధులు నిర్వహణకు
కేటాయిస్తారు ఇది కూడా ఆచరణ సాధ్యం కాదని కాంట్రాక్టర్లు భావించడంతో టెండర్లు వేయడానికి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం పిఆర్లో 17 ప్యాకేజిలుగా, ఆర్అండ్లో 32 ప్యాకేజీలుగా విభజించడం కూడా కాంట్రాక్టర్లు విముఖత వ్యక్తంచేస్తున్నారు.
టెండర్లు వేయకపోవడంతో డిసెంబర్ 29 వరకు గడువు పొడిగింపు
ప్రతి నియోజక వర్గంకు ఒక ప్యాకేజ్ ఏర్పాటు చేయాలని వారు కోరుకొంటున్నారు. నాలుగు వరుసల రోడ్లు అంటూ ప్రభుత్వం ఆర్భాట ప్రచారం చేస్తోందని కానీ కేవలం పదుల కిలోమీటర్లలో ఉంచటంతో వాటినిర్మాణ ఖర్చులు విపరీతంగా ఉంటాయని వారు కోట్ చేసిన రేట్కు పనికి చాలా వ్యత్యాసం ఉంటుందని కాంట్రాక్టర్లు అభిప్రాయ పడుతున్నారు. నాలుగు వరుసల రోడ్లు తొలి విడుతలో మేడ్చల్ శామిర్పేట మధ్య 10కిమి దుండిగల్-మేడ్చల్ మధ్య 10కిమి, హయత్నగర్ అనాజిపూర్ 15కి.మి, హయత్నగర్ తారామతిపేట 10కి.మీ విస్తరిస్తున్నారు. భువనగరి- చిట్యాల ఒక్కటే 43కి.మి నిడివితో విస్తరించే అతి పెద్ద నాలుగువరసల రోడ్డని కాంట్రాక్టర్ల అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం డిపాజిట్లు పార్క్ చేసి సపరేట్ హెడ్ అకౌంట్ పెడితే డిసెంబరు 29 వరకు పొడి గించిన గడువులోగా కొంత మంది కాంట్రాక్టర్లు స్పందించే ఉండొచ్చు.
హ్యామ్ విధానంలో మార్పులపై చర్చకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం
హ్యామ్ విధానంలో రూ.11,399 కోట్ల విలువగల ఆర్ అండ్ బి హ్యామ్ రోడ్ల ప్రాజెక్టుతో పాటు చేపట్టిన పంచాయతీరాజ్ శాఖ ఇదేవిధానంలో 17 ప్యాకేజలతో రూ.6,293 కోట్లతో చేపట్టిన 7,449 హై కి.మీ కాంట్రాక్టర్లు టెండర్ దాఖలు చేయక పోవడంతో టెండర్ల గడువును డిసెంబరు 29 వరకు పొడగించడమే కాకుండా డిప్యూటీ సిఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టివిక్రమార్క (Finance Minister Bhatti Vikramarka) రంగంలోకి దిగాల్సి వస్తోంది. ఆర్ అండ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితోపాటు, ఆర్ అండ్ ఉన్నతాధికారులు 17న లేదా 18న సమావేశమై కాంట్రాక్టర్లు ముందుకు రాక పోవడానికి ఉన్న నిబంధనల సరళీకరణపై చర్చించే అవకాశం ఉంది.
హ్యామ్ రోడ్ల(Ham roads)లో విధానపరమైన మార్పులు చేసి కాంట్రాక్టర్లకు అనుకూలంగా కొత్తగా మార్గదర్శకాలు చేపట్టేందుకు చర్చ జరుగుతుందని భావిస్తున్నారు. హ్యామ్ విధానం అనుసరించే స్థాయి కాంట్రాక్టర్లు తెలంగాణాలో లేరని అప్పుతీసుకొచ్చి రోడ్లు వేయలేమని కాంట్రాక్టర్లు చేతులు ఎత్తేస్తున్నారు. ప్రభుత్వం కౌంటర్ గ్యారెంటీ ఇస్తేనే రాష్ట్రంలో గ్రామ పంచాయతీల నుంచి మండలాలకు మట్టి రోడ్లను బీటీ రోడ్లుగా, మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు ఉన్న సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా, జిల్లా కేంద్రాల నుంచి నాలుగు లేన్ల రహదారులుగా మార్చా లని ప్రభుత్వం లక్ష ్యం నిర్దేశించుకుంది. ఇవి కాకుండా ప్రస్తుత రహదారులను మరింత పటిష్ట పరిచేలా ప్రణాళిక రచించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: