हिन्दी | Epaper

Telangana: మంత్రులపై సీఎం రేవంత్ ఆగ్రహం 

Saritha
Telangana: మంత్రులపై సీఎం రేవంత్ ఆగ్రహం 

తెలంగాణ (Telangana) కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మంత్రులు, పార్టీ కీలక నేతలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడంపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సమీక్షలో సీఎం మంత్రులపై అసహనానికి గురయ్యారని సమాచారం. 

Read Also: Yadadri Bhuvanagiri: నీళ్లు అనుకొని కెమికల్ తాగి వ్యక్తి మృతి

Telangana: మంత్రులపై సీఎం రేవంత్ ఆగ్రహం 
CM Revanth expresses anger at the ministers.

విపక్షాలు నాపై మాటల దాడి చేస్తుంటే మీరెవరూ నోరు మెదపరా? ప్రతిదానికీ నేనే ముందుండి సమాధానం చెప్పాలా? మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అంటూ ఆయన నేరుగా ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే సమీక్షలో కొందరు మంత్రులు రహస్యంగా భేటీ కావడంపై కూడా సీఎం ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. 

ముఖ్యంగా (Telangana) ప్రభుత్వ రహస్యాలు, కీలక నిర్ణయాలు బీఆర్ఎస్ నేతలకు ముందే ఎలా తెలుస్తున్నాయన్న అంశంపై రేవంత్ సీరియస్ అయ్యారని పొలిటికల్ సర్కిల్ లో జోరుగా ప్రచారం నడుస్తోంది. సొంత పార్టీలోనే కోవర్టులు ఉన్నారా అనే కోణంలో కూడా సీఎం రేవంత్ ఆరా తీసినట్లుగా సమాచారం.

కాన్వాయ్‌పై దాడి జరగడంపై ఆరా

మేడారం జాతర సందర్భంగా మంత్రుల కాన్వాయ్‌పై దాడి జరగడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆ ఘటనకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? నిఘా విభాగాలు ఏం చేస్తున్నాయి? అంటూ ఆయన అధికారులను ప్రశ్నించారు. ఇదే సందర్భంగా రాబోయే మున్సిపల్ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేస్తూ, గ్రూపు రాజకీయాలను పక్కనబెట్టి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అలసత్వం కొనసాగితే కఠిన నిర్ణయాలు తప్పవని పరోక్షంగా హెచ్చరిస్తూ, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్న నివేదికలు తమకు అనుకూలంగానే ఉన్నాయని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

📢 For Advertisement Booking: 98481 12870