BC Reservations Meeting : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు (BC Reservations Meeting), స్థానిక సంస్థల ఎన్నికలు, ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత ఆర్డినెన్స్ ఆమోదం వంటి అంశాలు ప్రధాన చర్చావిషయాలుగా ఉండనున్నాయి.
రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు, సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలోని బీసీ రిజర్వేషన్ల అంశంపై కేబినెట్ వ్యూహరచన చేయనుంది. 42 శాతం రిజర్వేషన్ల అమలు సాధ్యమా? లేక పాత విధానంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలా? అనే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు : ఇక ఇటీవల కేబినెట్ ఆమోదించిన ఇద్దరు పిల్లల నిబంధన ఆర్డినెన్స్ పై కూడా తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. అదేవిధంగా, కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు, SLBC పునరుద్ధరణ, SRSP రెండో దశ పనులకు సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉంది.
Breaking News – TTD : 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు
ప్రభుత్వం ఇప్పటికే బీసీ రిజర్వేషన్లపై న్యాయ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయడానికి కేబినెట్ ముందడుగు వేసే అవకాశం ఉందని సమాచారం.
కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించడానికి ప్రజల మద్దతు పొందే విధంగా కొత్త పథకాలను ప్రకటించే అవకాశమూ ఉంది. రేపటి కేబినెట్ మీటింగ్‌లో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉన్నందున అందరి దృష్టి ఆ సమావేశంపైనే నిలిచింది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :