తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని బీసీ సంక్షేమ శాఖ శుక్రవారం సాయంత్రం జీవో రూపంలో ప్రకటించింది.
డెడికేటెడ్ కమిటీ సిఫార్సులు అమలు
ఈ ఉత్తర్వు జీవో నెంబర్ 9 (Go number 9)రూపంలో విడుదలైనది. రాష్ట్ర ప్రభుత్వం బీసీల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ సిఫార్సులను అనుసరించి ఈ రిజర్వేషన్లను కల్పించింది.
50 శాతం పరిమితిని తొలగింపు
ఇప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నిక(Election of local bodies)లలో రిజర్వేషన్లకు ఉన్న 50 శాతం పరిమితిని ప్రభుత్వం తొలగించింది. బీసీ వర్గాలకు ప్రత్యేకంగా 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ, వారి భాగస్వామ్యం పెంచేందుకు చర్యలు తీసుకుంది.
ఎన్నికల గడువు నేపధ్యంలో కీలక చర్య
హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో, ఆ గడువును క్రమంగా పాటిస్తూ బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం జీవో విడుదల చేయడం విశేషం.
Read hindi news: hindi.vaartha.com
Read Also: