తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కొత్త వాహనాల కొనుగోలుపై అదనపు పన్ను విధించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రోడ్డు భద్రతను మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతో రోడ్ సేఫ్టీ సెస్ (Road Safety Cess) ను అమలు చేయనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే పలు రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయని, అదే తరహాలో తెలంగాణ (Telangana) లోనూ ఈ సెస్ వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు.
Read also: TG High Court: సెర్చ్ వారెంట్ల జారీ విధానంపై స్పష్టతనివ్వాలి: హైకోర్టు

కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు మాత్రమే వర్తింపు
కొత్త ద్విచక్ర వాహనాలకు రూ.2 వేలు, కార్లకు రూ.5 వేలు, లారీల (హెవీ వెహికల్స్) కు రూ.10 వేల చొప్పున రోడ్ సేఫ్టీ సెస్ వసూలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. రోడ్డు భద్రత కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసేందుకే ఈ సెస్ విధిస్తున్నామని, ఇది కేవలం కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు మాత్రమే వర్తిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. అయితే, ఈ పన్ను నుంచి ఆటోలు, ట్రాక్టర్ ట్రైలర్లకు మినహాయింపు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: