న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పార్టీలు, ఈవెంట్లు, పబ్‌లు, క్లబులు, బార్లు పర్మిట్ రూముల్లో మందు తాగుతూ మందుబాబులు సందడి చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్‌తో మద్యం తాగుతూ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు తాగుతూ చిల్ అవుతూ ఉంటారు. దీంతో డిసెంబర్ 31న రాత్రి నుంచి జనవరి 1న ఉదయం వరకు పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు ఎక్కడికక్కడ నిర్వహిస్తూ ఉంటారు. పట్టుబడినవారికి జరిమానా విధించడంతో పాటు కేసులు నమోదు చేయనున్నారు. ఈ క్రమంలో డ్రంకెన్ డ్రైవ్ చేయవద్దని పోలీసులు మందుబాబులను హెచ్చరిస్తున్నారు.
Read Also: Elections:తెలంగాణలో 2026 మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం
ఉచిత రైడ్ సేవలు
ఈ క్రమంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా మందు బాబుల కోసం తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) ఉచిత రైడ్ సేవలు ఇవ్వనున్నట్లు తెలిపింది. మద్యం తాగి వాహనం నడపలేని స్థితిలో ఉన్నవారికి ఈ సర్వీస్ అందిస్తామని తెలిపింది. HYD, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఇవాళ రాత్రి 11 గంటల నుంచి జనవరి 1 అర్ధరాత్రి ఒంటిగంట వరకు సేవలు ఉంటాయని పేర్కొంది. 8977009804 నంబర్‌కు కాల్ చేసి ఈ సర్వీసులు పొందవచ్చని వెల్లడించింది.

కొత్త ఏడాది వేళ నగరంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పలు గైడ్ లైన్స్ జారీ చేశారు. మద్యం తాగినవారికి రెస్టారెంట్స్, బార్, ఈవెంట్ల యజమానుల క్యాబ్ సర్వీస్ కల్పించాల్సి ఉంటుంది. డ్రైవర్‌ను కేటాయించాల్సి ఉంటుంది. ఇక మద్యం తాగి రోడ్లపై హల్ చల్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహించనున్నారు. పట్టుబడినవారి వెహికల్‌ను సీజ్ చేయడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: