కడియం శ్రీహరి, దానం నాగేందర్ కు మళ్లీ స్పీకర్ నోటీసులు
హైదరాబాద్ : ఫిరాయింపు ఎమ్మెల్యేలు(Telangana) కడియం శ్రీహరి, దానం నాగేందర్లకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar) మరోసారి నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై వివరణ కోరుతూ ఆయన గురువారం ఈ నోటీసులు జారీ చేశారు. తక్షణమే అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గతంలో నోటీసులు జారీ చేయగా, సమాధానం ఇచ్చిన 8 మందిపై విచారణ కొనసాగుతోంది.
Read also: మిస్ యూనివర్స్ గా థాయ్ లాండ్ సుందరి

8 మంది ఎమ్మెల్యేలపై విచారణ సాగి ముగింపు దశకు చేరిక
దానం నాగేందర్, కడియం శ్రీహరి(Telangana) మాత్రం సమాధానం ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని కోరారు. గురువారంతో 8 మంది ఎమ్మెల్యేలకు చెందిన పిటిషన్లపై విచారణ పూర్తి అయింది. ఈ నేపథ్యంలో స్పీకర్ వారిద్దరికి మరోసారి నోటీసులు జారీ చేశారు. తక్షణమే అఫిడవిట్ దాఖలు చేయాలని అందులో పేర్కొన్నారు. విచారణ పూర్తయిన ఎమ్మెల్యేలకు సంబంధించి న్యాయ సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత స్పీకర్ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :