తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) (చింతపండు నవీన్) చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనుచరులు, ఆదివారం, మేడిపల్లి ప్రాంతంలోని క్యూ న్యూస్ కార్యాలయంపై (Q News Office) దాడి చేశారు. ఈ దాడిలో కార్యాలయ ఫర్నిచర్, కంప్యూటర్లు ధ్వంసమయ్యాయి. మల్లన్న గన్‌మెన్ గాల్లోకి కాల్పులు జరిపి పరిస్థితిని అదుపు చేశారు. ఈ ఘటనలో మల్లన్న సహా, కార్యాలయ సిబ్బంది గాయపడ్డారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు.

తీన్మార్ మల్లన్న స్పందన
తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇటువంటి దాడులతో బీసీ ఉద్యమం ఆగిపోతుందనుకుంటే అది పొరపాటేనని అన్నారు. బీసీల సమస్యలపై (problems of BCs) తాము ప్రభుత్వంతో పోరాడుతుంటే కవితకు ఎందుకు భాధ అని మల్లన్న ప్రశ్నించారు.
కుటుంబ సభ్యులు కేసీఆర్, కేటీఆర్ పై ఉన్న అసహనాన్ని కవిత తమపై ప్రదర్శిస్తామంటే ఊరుకోబోమని హెచ్చరించారు. ఇలాంటి దాడులకు పురిగొల్పిన కవిత ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అయినా, తాను ఇటువంటి దాడులకు భయపడేది లేదని, మూడేళ్లలో మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కడం ఖాయం అని హెచ్చరించారు.
అంతకుముందు, ఓ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ బీసీలతో మీకు కంచం పొత్తు ఉందా, మంచం పొత్తు ఉందా అంటూ కవితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు జాగృతి కార్యకర్తలను తీవ్ర ఆగ్రహానికి గురిచేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో వారు తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ కార్యాలయంపై దాడికి దిగినట్టు సమాచారం.
Read hindi news hindi.vaartha.com
Read also Fire Accident: పాశమైలారం పారిశ్రామిక వాడలో మరో అగ్ని ప్రమాదం