హైదరాబాద్ : తెల్ల రేషన్కార్డులు కొత్తగా పొందినవారు గృహజ్యోతి, రాయితీగ్యాస్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఉత్సాహ పడుతున్నా వెబ్ సైట్లో (WEBSITE) గ్యాస్ ఆప్షన్ ఓపెన్ కాకపోవడంతో దిగాలు పడుతున్నారు. గృహజ్యోతితో జీరో బిల్లు (ZERO BILL) పొందాలనుకొనే వారికి” కూడా సాంకేతిః “పరమైన ఇబ్బందులు తలెత్తున్నాయి. తెల్ల రేషన్ కార్డులు కొత్తగా పొందిన వారికి ఉచిత విద్యుత్తు, రాయితీపై గ్యాస్, తదితర సంక్షేమ పథకాలు వర్తించనున్నాయి. కొత్త రేషన్కార్డులు జారీతో జిల్లాలో గృహజ్యోతి లబ్దిదారుల సంఖ్య పెరగనుంది. ఈ పథకం నిరుపేదలు, బలహీనవర్గాల ప్రజలకు వరంగా మారింది. ప్రభుత్వం నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్తు సిలిండర్ వినియోగించుకున్న వారికి జీరో బిల్లు జస్తున్నారు. వధకాలకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం తాజాగా అవకాశం కల్పించింది. పదేళ్లుగా రేషన్ కార్డులు మంజూరు కాకపోవడంతో అర్హతలు ఉన్నప్పటికి ప్రభుత్వంలో వివిధ పథకాలకు చాలా మంది అర్హులు దూరమయ్యారు. ప్రస్తుతం రేషన్ కార్డులు మంజూరు చేయడంతో లబ్దిదారుల్లో ఆశలు చిగురించాయి. వీరితోపాటు గతంలో రేషన్కార్డులు కలిగి ఉండి పధకాలు పొందనివారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తుల స్వీకరణకు మున్సిపల్ కార్యాలయాలు, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా నూతనంగా 5.61లక్ష రేషన్ కార్డులను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా పలు పథకాలను అమలుచేస్తోంది. వీటిలో ముఖ్యంగా మహాలక్షి శ్రీ పథకంలో భాగంగా రూ.500లకే వంటగ్యాస్, గృహజ్యోతిలో 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు వంటి వాటికి రేషన్కార్డులు తప్పనిసరి చేసింది. దీంతో కార్డులేని కుటుంబాలు పధకాలు పొండలేకపోయారు.

ప్రభుత్వ నిర్ణయంతో ఈ సమస్య తీరనుంది. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన కార్యాలయాల్లో, పట్టణాల్లోని లబ్దిదారులు మున్సిపల్ కార్యాలయాల్లో సంప్రదించాలి. రాయితీ గ్యాస్ కోసం లబ్దిదారులు తమ ఆధార్కార్డు, తెల్లరేషన్ కార్డు జిరాక్స్ కాపీలతోపాటు గ్యాస్ కనెక్షన్ భ్రువీకరణ పత్రాలు మండల పరిషత్తు కౌంటర్లతో సమర్పించాలి. ప్రస్తుతం వెబ్సైట్లో రాయితీ గ్యాస్ ఆప్షన్ ఓపెన్ కావడం లేదని గృహజ్యోతి పథకం ఆప్షన్ మాత్రమే సెలక్ట్ అవుతుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం కొత్తగా తెల్లరేషన్ కార్డులు అందజేస్తుండగా ఎంపీడీవో కార్యాలయాలు, మున్సిపల్ కార్యా యలంలో ప్రభుత్వం నమోదుకు ఆదేశాలు జారీ చేస్తే జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లో గృహజ్యోతి లబ్దిదారులు పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే లబ్దిదారులకు అవకాశం కల్పిస్తామని విద్యుత్తు అధికారులు కు తెలిపారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ MORE :