हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

కేసీఆర్‌ను చూసినప్పుడు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి : హరీశ్ రావు

sumalatha chinthakayala
కేసీఆర్‌ను చూసినప్పుడు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి : హరీశ్ రావు

అప్పటికీ కేసీఆర్ నిరాహార దీక్ష చేసి 11 రోజులైంది..

హైదరాబాద్‌: .బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 71వ జన్మదినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్‌ను చూసినప్పుడు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి.తెలంగాణ కోసం కేసీఆర్‌ దీక్ష చేసినప్పుడు ఆయన్ను చూస్తే నాకు ఏడుపొచ్చింది. అప్పటికీ కేసీఆర్ నిరాహార దీక్ష చేసి 11 రోజులైంది. కంట్రోల్‌లో లేడు, వణుకుతున్నాడు, కానీ పట్టుదల మాత్రం వీడలేదు

కేసీఆర్‌ చూసినప్పుడు నా కళ్లల్లో నీళ్లు

కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో

అప్పుడు కేసీఆర్‌ను చూసినప్పుడు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అప్పటి సెంట్రల్ హోంమినిస్టర్ చిదంబరం కాల్ చేసి కేసీఆర్ మీరు దీక్షవిరమించాలని కోరినా.. ఆయన నమ్మలేదు. కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తేనే దీక్ష విడుతానని చెప్పాడని హరీశ్ రావు గుర్తు చేశారు. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించారని కొనియాడారు. తెలంగాణ జైత్రయాత్రనో.. కేసీఆర్‌ శవయాత్రనో అంటూ ఆమరణ దీక్షకు దిగారని గుర్తుచేశారు.

రాష్ట్రమంతా పండుగలా కేసీఆర్‌ పుట్టినరోజు

కేసీఆర్‌ దీక్షకు దిగివచ్చిన కేంద్రం తెలంగాణ ప్రకటించిందని వెల్లడించారు. తెచ్చుకున్న తెలంగాణను అద్భుతంగా తయారు చేసిన ఘనత కేసీఆర్‌దేనని చెప్పారు. మా కేసీఆరే మళ్లా రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్‌, తెలంగాణ ప్రజల నడుమ ఉన్నది పేగుబంధమని చెప్పారు. రేవంత్‌ రెడ్డి తీరుతో ప్రజలు విసిగిపోయారన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ పుట్టినరోజును ఘనంగా నిర్వహించిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్‌ పుట్టినరోజును రాష్ట్రమంతా పండుగలా జరుపుకుంటున్నారు.

కేసీఆర్‌కు శుభాకాంక్షల వెల్లువ

తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ నాయకుడిపై ప్రేమను చాటుకుంటున్నారు. పలువురు నేతలు, అభిమానులు, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. #HappyBirthdayKCR, #TelanganaCM వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి.

సేవా కార్యక్రమాలతో జన్మదిన వేడుకలు

కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనాథాశ్రమాల్లో భోజన విరాళాలు అందించడంతో పాటు, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రజల సంక్షేమమే తన ధ్యేయమని చెప్పిన కేసీఆర్ పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో జరపడం గర్వకారణమని బీఆర్ఎస్ నేతలు తెలిపారు.

కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి

కేసీఆర్ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి అందించిన సేవలను బీఆర్ఎస్ నేతలు ప్రస్తావించారు. రైతు బంధు, కాళేశ్వరం ప్రాజెక్ట్, దళితబంధు, శుభ్రమైన నీటికి హక్కు వంటి పథకాలతో రాష్ట్ర అభివృద్ధికి ఆయన కృషి చేసినట్లు గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి చెందిన మోడల్ స్టేట్‌గా తీర్చిదిద్దిన ఘనత ఆయనదేనని తెలిపారు.

రేవంత్ రెడ్డిపై విమర్శలు

ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నారని హరీశ్ రావు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి మందకొడిగా మారిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నారని ఆరోపించారు.

కేసీఆర్ పునరాగమనంపై ఆశలు

ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారుతున్న నేపథ్యంలో, 2028లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావాలని పార్టీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయి. కేసీఆర్ నాయకత్వంలో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని కోరుకుంటున్నామని నేతలు చెప్పారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870