Bondi Beach Attack: ఆస్ట్రేలియాలోని సిడ్నీ(Sydney) నగరంలో గల బండి బీచ్లో యూదులపై కాల్పులు జరిపిన ఉగ్రవాది సాజిద్ అక్రం (50) హైదరాబాద్ వాసిగా గుర్తించారు. ఇతను టోలిచౌకికి చెందిన వాడుగా పోలీసులు గుర్తించారు. బికాం వరకు చదివిన ఇతను 1998లో ఉద్యోగం వేటలో ఆస్ట్రేలియాకు వలసవెళ్లి అక్కడే చిన్నాచితక పనులు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వలస వచ్చిన యూరప్కు చెందిన వెనెరా గ్రోస్సో అనే మహిళను ఇతను వివాహం చేసుకున్నాడు. ఇతనికి కుమారుడు నవీద్ అక్రంతోపాటుకుమార్తె ఉంది. భారత్లో సాజిద్ అక్రంపై ఎలాంటి నేరచరిత్ర లేదని పోలీసులు గుర్తించారు.
Read also: TG Panchayat Elections: మూడవ విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం
బాండి బీచ్ దాడి వెనుక హైదరాబాద్ లింక్
ఆస్ట్రేలియా వెళ్లాక ఇతను ఆరుసార్లు భారత్కు వచ్చినట్లు చివరగా 2022లో వచ్చాడు. రెండేళ్ల క్రితం తండ్రి చనిపోయినా సాజిద్ ఆక్రం కానీ అతని భార్యాపిల్లలు కానీ రాలేదని బంధువులు చెబుతున్నారు. కాగా ఆదివారం సాజిద్ ఆక్రం తన కుమారుడు నవీర్ణక్రంతో కలిసి బాండి బీచ్ వద్ద యూదులు హనుక్కా పేరిట మత వేడుకలు నిర్వహిస్తుండగా తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరపడం తెలిసిందే. ఈ కాల్పుల్లో 15 మంది మరణించగా 20 మంది వరకు గాయపడ్డారు. సమాచారం అందగానే ఘటనా స్థలికి చేరుకున్న ఆస్ట్రేలియా పోలీసులు సాజిద్ అక్రంను కాల్చి చంపగా అతని కుమారుడు నవీర్ణక్రంను ఆరెస్టు చేశారు.

సాజిద్ అక్రం ఐసిస్ శిక్షణ వివరాలు వెలుగులోకి
నవీద్ ఆక్రంను విచారించగా తండ్రితోపాటు తాను ఫిలిప్పీన్స్లో ఐసిస్ ఉగ్రవాద శిబిరం(ISIS terrorist camp)లో శిక్షణ పొందినట్లు వెల్లడించాడు. తన తండ్రి భారత్కు చెందిన వాడని, హైదరాబాద్లో పాస్పోర్టు పొందాదని, ఇప్పటికీ దానిని వాడుతున్నట్లు అతను చెప్పడంతో దీనిపై ఆస్ట్రేలియా పోలీసులు భారత విదేశాంగ శాఖకు, ఐబికి సమాచారం అందించి సహకరించాలని కోరారు.
కేంద్ర హోంశాఖ సాజిద్ ఆక్రం వ్యవహారంపై పూర్తి వివరాలు సేకరించాలని రాష్ట్ర పోలీసు శాఖను కోరగా రంగంలో దిగిన పోలీసు శాఖ సాజిద్ ఆక్రం గురించి ఆరా తీయగా అతను హైదరాబాద్ వాసిగా తేలడంతోపాటు అతని కుటుంబసభ్యులు అనేక మంది టోలిచౌకి, గోల్కొండలో ఉంటున్నట్లు నిర్ధారణ అయ్యింది.
హైదరాబాద్‌లో ఉగ్ర ముఠా ఏర్పాటు చేశాడా?
పోలీసులు అతని బంధువులను విచారించగా ఆస్తులను అమ్మేందుకు గతంలో కొన్నిసార్లు హైదరాబాద్కు వచ్చినట్లు వారు తెలిపారు. దీనిపై డిజిపి కార్యాలయం ప్రకటన విడుదల చేస్తూ సాజిద్ అక్రం కుటుబంపై మరింత లోతుగా విచారిస్తున్నట్లు తెలిపింది. సాజిద్ ఆక్రంపై ఇక్కడ ఎలాంటి నేర చరిత్ర లేదని పేర్కొంది. ఈ విషయంలో దర్యాప్తు సంస్థలకు సహకరిస్తామని డిజిపి కార్యాలయం వెల్లడించింది.
ఇదిలా ఉండగా బాండి బీచ్లో యూదులపై కాల్పులు జరిపి 15 మందిని చంపిన హైదరాబాద్ వాసి సాజిద్ అక్రం ఐసిస్ ఉగ్రవాదిగా తేలడంతో హైదరాబాద్లో అతని సహచరులు ఎవరైనా ఉగ్రవాదులుగా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. సాజిద్ ఆక్రం హైదరాబాద్లో ఏమైనా ముఠాను స్థాపించి అందులో ఉగ్రవాదులుగా ఇక్కడి యువకులను చేర్పించాడా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: