సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని మాజీ సీఎం కట్టించిన కాలేశ్వరం ప్రాజెక్టు గురించి అసలు వాస్తవాలపై, రైతులకు అర్థమయ్యే విధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రైతులకు నీళ్ళొచ్చాయో లేదో రైతుల వద్దకే వెళ్లి తెలుసుకుందం అని దమ్ముంటే రా..చిన్న సీతారాం తండాకు వెళ్లాం.. అక్కడి రైతు చేతికే చెప్పు ఇద్దాం, వాళ్ల భూములకు నీళ్లు అందలేదంటే నన్ను కొడతారు. నీళ్లు అందినా యంటే నిన్ను కొడతారని ఎద్దువా చేశారు. ఇంటి దొంగలను దొరకబట్టి. ఇక్కడనే పాతి పెట్టాలె, కండ్ల ముందు నీళ్లు పోతుంటే, రైతులు (Farmers) కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, కాళేశ్వరంపై కాంగ్రెస్ వర్గం మీడియా దుష్ప్రచారం చేసిందని ఆరోపించారు. కూలిందన్న ప్రాజెక్టుపై నేనే స్వయంగా కారులో పర్యటన చేసినట్టు చెప్పారు. ఆ దారిలో 9 కిలోమీటర్లకు పైగా ఇసుక లారీలు అగి ఉన్నాయన్నారు ప్రపంచంలోనే అద్భు తమైన ప్రాజెక్టు నిర్మించిన ఘనత కేసీఆర్ ది మాత్రమే.
పొలాలు ఎందుకు ఎండినయో సమాధానం చెప్పాలి
సూర్యాపేట జిల్లాకు లక్షలాది ఎకరాల్లో కాలేశ్వరం నీళ్లందించినం. కాలేశ్వరం కూలేశ్వరం అయిందని కాంగ్రెస్ బిజెపిలో విష ప్రచారం చేశాయి, కన్నెపల్లి నుంచి 380 కిలోమీటర్ల మేర ప్రవహించి సూర్యాపేటకు నీళ్లు వస్తున్నాయి. ఇసుక దందా కోసమే కాలేశ్వరం నీళ్లు ఎత్తిపోయడం లేదు. దీంతో రేవంత్ కు స్వామి కార్యం, స్వకార్యం రెండూ నెరవేరుతున్నాయి. పోయిన యాసంగిలో పొలాలు ఎందుకు ఎండినయో సమాధానం చెప్పాలి. నీళ్లు పారె కాలువల్లో నేడు తుమ్మలు, సర్కారు చెట్లు మోలుస్తున్నాయ్, చంద్రబాబు (Chandrababu) లాంటి నీటిదొంగలతో చర్చలెందుకు,మేడిగడ్డలో ఒకటి, రెండు పిల్లర్లు మాత్రమే కుంగిపోయినయ్, మోటార్లు పాడైతే రిపేర్ చేయించుకోమా, కుంగిన పిల్లర్ను రిపేర్ చేయకుండా, కుంటిసాకుతో రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నారు, చరిత్రలో ఎప్పుడు లేనివిధంగా గోదావరిలో 38 లక్షల క్యూసెక్కుల వరద నీరు, కాలేశ్వరం అంటే 3 బ్యారేజీలు,15 రిజర్వాయర్లు 19 సబ్ స్టేషన్లు, 21 పంపు హౌజ్ లు అన్ని.

ఆరోపణలు తప్పని
203 కిలోమీటర్ల మీద సొరంగాలు.. 1531 కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్స్,98 కిలోమీటర్ల మేర ప్రెజర్ మెయిన్స్,141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్టు, 240 టీఎంసీల నీటి వినియోగం ఉన్నది. ఇది కాలేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపం,ఇప్పుడు నీళ్లు ఇస్తే కాళేశ్వరం పైన చేసిన ఆరోపణలు తప్పని తేలుతుందని భయం, కెసిఆర్కు మంచి పేరు వస్తుందని మరో భయం పట్టుకుంది. ఇప్పుడు నువ్వు ఏదో కుంటి సాకులు చెబితే రైతులు నమ్మరు,ఇకనైనా చంద్ర బాబుకు గులాంగిరి మాని.. తెలంగాణ రైతాంగంపై దృష్టి పెడితే మంచిది. నీళ్లు ఇస్తే రైతులు పంట సాగు చేసుకుని బాగుపడతారని రైతులతో రాజకీయం చేస్తే మంచిది కాదని అన్నారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) చెప్పిన విషయాన్ని పూర్తిగా తెలు సుకున్నారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎవరు?
గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన టీఆర్‌ఎస్ (ప్రస్తుతం BRS) పార్టీ సీనియర్ నేత. ఆయన సూర్యాపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
జగదీష్ రెడ్డి రాజకీయ జీవిత ప్రారంభం ఎప్పుడు?
ఆయన రాజకీయ జీవితం 2001లో TRS పార్టీలో చేరిన తర్వాత ప్రారంభమైంది. తక్కువ కాలంలోనే కృషి ద్వారా పార్టీ నాయకత్వానికి దగ్గరయ్యారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Elections: పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి