MLAల పార్టీ ఫిరాయింపు కేసుల్లో సుప్రీంకోర్టు(SupremeCourt) గట్టిగా వ్యవహరించింది. కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై అసెంబ్లీ స్పీకర్‌కు(Assembly Speaker) నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై 3 నెలల వ్యవధిలో చర్యలు ఎందుకు తీసుకోలేదో స్పీకర్ వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అలాగే, సంబంధిత విచారణను 4 వారాల్లో పూర్తిచేయాలని స్పష్టమైన డెడ్‌లైన్ ఇచ్చింది.
Read Also: LPG Deal: భారత్‌కు చవక LPGకి దారి తెరిచిన కొత్త ఒప్పందం

ప్రభుత్వం అభ్యర్థన – కేసు పాస్ ఓవర్
విచారణ సమయంలో ప్రభుత్వ న్యాయవాదులు ఈ కేసును పాస్ ఓవర్ చేయాలని అభ్యర్థించగా, సుప్రీంకోర్టు తాత్కాలికంగా అంగీకరించింది. ఈరోజు సాయంత్రం కేసును మళ్లీ విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. భారత రాజకీయాల్లో పార్టీ మార్పులు (డిఫెక్షన్) తరచూ వివాదాస్పదమవుతుంటాయి. పదివి రక్షణ, స్పీకర్ చర్యలు, అర్హత రద్దు వంటి అంశాలపై రాష్ట్రాల్లో పలు కేసులు సుప్రీంకోర్టుకు వస్తాయి. ఈ నేపథ్యంలో, ఈ కేసుపై కోర్టు(SupremeCourt) ఇచ్చిన గడువులు కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా, స్పీకర్ నిర్ణయాలపై కోర్టు పర్యవేక్షణ పెరగడంతో ఫిరాయింపు కేసుల్లో తీర్పు త్వరితంగా వెలువడే అవకాశం ఉంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: