ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టు(Banakacherla Project)పై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈ ప్రాజెక్టు తెలంగాణకు ముప్పుగా మారుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణం ద్వారా తెలంగాణకు రావాల్సిన వాటర్ షేర్ దోపిడీకి గురవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
హరీశ్ రావు మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టును ఆపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ పైన జరుగుతున్న నీటి దాడులను నిర్ద్వందంగా ఎదుర్కొనాల్సిన బాధ్యత తెలంగాణ బీజేపీకి ఉందని అన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు బనకచర్ల ప్రాజెక్టును ఆపాలని సవాలు విసిరారు. తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన బాధ్యత కలిగినవని ఆయన పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ఎటువంటి పొత్తులు పెట్టుకోదు
ఇదిలా ఉండగా, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎటువంటి పొత్తులు పెట్టుకోదని హరీశ్ రావు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ప్రజల మద్దతుతో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యమని తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టుపై తాము మౌనం వహించబోమని, తెలంగాణ ప్రయోజనాల కోసం అన్ని మార్గాల్లో పోరాటం కొనసాగిస్తామని హరీశ్ రావు స్పష్టం చేశారు.
Read Also : Tiruvuru : తిరువూరు నగర పంచాయతీ టీడీపీ కైవసం