కోటి విద్యలు కూటికోసమేనంటారు. తినే ఆహారం, తాగే నీరు పరిశుభ్రంగా లేకపోతే రోగాలతో సతమతమవ్వాల్సిందే. బతికేందుకు తింటే బతుకునే బలితీసుకునేలా ఉంటున్నదని విద్యార్థులు (Student) వాపోతున్నారు. ఈ తిండిమాకొద్దని రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గద్వాల జిల్లా (Gadwal District) అలంపూర్ మండలం పుల్లూరు గ్రామంలోని మహాత్మాగాంధీ జ్యోతిరావుపూలే గురుకుల పాఠశాలో తాగునీరు రాక ఉప్పునీరు తాగుతున్నామని, పురుగుల అన్నం తింటున్నామని, మరుగుదొడ్లు సరిగ్గా లేక బహిర్భూమికి పంటపొలాల్లోకి వెళ్తున్నామని విద్యార్థులు (Student) వాపోతున్నారు. ఈ పురుగుల అన్నం తినలేమని, తమకు మంచి అన్నం పెట్టాలని కోరుతూ విద్యార్థులు పాదయాత్ర చేస్తున్నారు. అలంపూర్ నుండి గద్వాల కలెక్టరేట్ వరకు 32 కిలోమీటర్లు పాదయాత్రగా విద్యార్థులు వెళ్తున్నారు. అధికారుల్లో చలనం లేదు మిషన్ భగీరథ నీరు రాక ఫోరైడ్ నీరు (Phoride water) తాగుతున్నామని, గత సంవత్సరం నుండి చెబుతున్నా అధికారుల్లో చలనం లేదని పాదయాత్ర చేసిన విద్యార్థులు వాపోతున్నారు. తమ సమస్యలు చెప్పడానికి గురుకుల విద్యార్థులు అలంపూర్ చౌరస్తా నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు పాదయాత్రగా వెళ్లారు. అధికారులు సరైన చర్యలు తీసుకుని, నిరుపేద విద్యార్థులకు సరైన ఆహారం అందిస్తే బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటేనే చక్కగా చదువుకు ఉజ్వలభవితకు బాటలు వేసుకోగలరని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
పుల్లూరు గ్రామ గురుకుల పాఠశాల విద్యార్థులు ఎందుకు పాదయాత్ర చేశారు?
తాగునీరు లేకపోవడం, పురుగులున్న అన్నం, మరుగుదొడ్ల లేకపోవడంపై నిరసనగా వారు 32 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.
విద్యార్థుల సమస్యలపై అధికారులు ఏమాత్రం స్పందించలేదని వారు ఎందుకు చెబుతున్నారు?
గత సంవత్సరం నుండి ఫ్లోరైడ్ నీటి సమస్యపై చెప్పినా, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థులు వాపోతున్నారు.
Read Hindi News : hindi.vaartha.com
Read also: midazolam injection: ఆపరేషన్ల సమయంలో వాడే మత్తు ఇంజక్షన్లు బహిరంగ మార్కెట్లో విక్రయం