SRSP Water Levels : ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామసాగర్ జలా శయంపై ఎగువన మహారాష్ట్ర జైక్వాడ్ నుంచి బాబ్లీ వరకు అనేక ప్రాజెక్టులు నిర్మించి బేసిన్ బయటి ప్రాంతాలకు నీటిని తరలిస్తుండటంతో ప్రతియేడు ఎస్సారెస్పీకి నీరు వచ్చి చేరుతుందా లేదా అనే అనిశ్చితి నెల కొంటుంది. బాబ్లీ ప్రాజెక్టు గేట్లు సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పును అనుసరించి ప్రతి యేడు జూలై 1న ఎత్తి అక్టోబర్ 29న దించి వేయాల్సి ఉంటుంది. అంతేకాదు మార్చి 1న బాబ్లీ గేట్లు ఎత్తి 0.6టిఎంసి నీటిని ఎస్సారెస్పీకి వదలాల్సి ఉంటుంది. ఈ సంత్సరం బాబ్లీ గేట్లు ఆనవాయితీగా ఎత్తినా కూడా ఆగస్టు రెండో వారం పెద్దగా నీరు వచ్చి చేరలేదు. మూడోవారం మహా రాష్ట్రలో కురిసిన భారీ వర్షాల (Heavy rains) కారణంగా వరద ఎస్సారెస్పీలోకి పోటెత్తింది. వారం రోజుల్లోనే 128.394 టిఎంసిల నీటిని ఎస్సారెస్పీ ఒడిసిపట్టింది. అందులో 61.449 టిఎంసిల నీరు ఇందిరమ్మ ఫ్లడ్, మిషన్భగీరథ, నిజా మాబాద్, నిర్మల్ టిఎస్ఐడి పథకాలద్వారా, గుప్త లిఫ్ట్ ఇరిగేషన్, అనిసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్, లక్ష్మీ కెనాల్, కాకతీయ మెయిన్ కెనాల్, జల విద్యుత్ ఉత్పత్తి వంటి అవసరాలు తీర్చుకోవడానికి వినియోగించడంతో పాటు స్పిల్వే ద్వారా దిగువకు విడుదల చేసిన 34 టిఎంసిల నీరు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చిచేరింది.

శ్రీరామ సాగర్ కు ప్రస్తుతం సోమవారం రాత్రి 8 గంటల వరకు ఎగువ నుంచి 30వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చిచేరుతోంది. అదే స్థాయిలో నీటిని బయటకు వదిలిపెడుతున్నారు. నీటిమట్టం 1090.90 ఫీట్ల ఎత్తులో 80టిఎంసిలనీరు ఇప్పు డు అందులో ఉంది. ఊష్ణోగత్ర పెరిగి పోవడంతో రోజుకు 666 క్యూసెక్కుల నీరు ఆవిరిగా వృధా అవుతోన్నది. జూరాల జలాశయానికి కూడా 3.88 లక్షల క్యూసెక్కుల వరదనీరు ఎగువన కర్ణాటక నుంచి ఆదివారం రాత్రి వరకు వచ్చిచేరింది.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :