हिन्दी | Epaper

Sridhar Babu: మరిన్ని పెట్టుబడులు పెట్టండి

Saritha
Sridhar Babu: మరిన్ని పెట్టుబడులు పెట్టండి

దిగ్గజ సంస్థ ఒరికాకు మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానం

హైదరాబాద్ : దేశంలోనే పారిశ్రామికాభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా నిలుస్తున్న తెలంగాణలో(sridhar Babu) మరిన్ని పెట్టు బడులు పెట్టాలని ఆస్ట్రేలియా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న దిగ్గజసంస్థ ఒరికా ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ఆ దేశ పర్యటనలో భాగంగా బుధవారం మెల్ బోర్న్ పారిశ్రామిక పేలుడు పదార్థాల తయారీ, మైనింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర రంగాల్లో అంతర్జాతీయ అగ్రగామిగా ఉన్న ఆ సంస్థ సిఈఓ, ఎండి సంజీవ్ గాంధీ, ఇతర ప్రతినిధులతో మంత్రి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణలో ఒరికా ప్రస్తుత కార్యకలాపాలు, భవిష్యత్తు విస్తరణ ప్రణా ళికలపై ఈసమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఇన్నోవేషన్, టెక్నాలజీ హబ్లను ఏర్పాటు చేసేం దుకు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తెలంగాణ వైపు చూస్తున్నాయి. జిసిసిలు, పరిశ్రమల ఏర్పా టుకు రాష్ట్రం అత్యంత అనుకూలం. పారిశ్రామి కాభివృద్ధిని ప్రోత్సహించే ప్రగతిశీల విధానాలు, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, ఎకో సిస్టమ్, స్థిరమైన ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకత్వం అందుబాటులో ఉంది అని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు కంపెనీ ప్రతిని ధులకు వివరించారు.

Read also: తిరుమలను ముంచెత్తిన వాన

sridhar Babu
Sridhar Babu: మరిన్ని పెట్టుబడులు పెట్టండి

ఇన్నోవేషన్, మైనింగ్, మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో భాగస్వామ్యానికి ఆహ్వానం

ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్, సస్టెయినబిలిటీ, మాన్యుఫాక్చరింగ్, మైనింగ్ రంగాల్లో డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ కోసం తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని ఆహ్వానించారు. పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ(Telangana) రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవ, అమలు చేస్తున్న ప్రోత్సాహాకర, ప్రగతిశీల విధా నాలు అభినందనీయం. ప్రస్తుతం హైదరాబాద్లో నిర్వహిస్తున్న జిససిలో డిజిటల్ ఇంజనీరింగ్, ఆటోమేషన్, అడ్వాన్స్డ్ అనలిటిక్స్ తదితర రంగాల్లో 600 మంది హై స్కిల్డ్ నిపుణులకు ఉద్యోగాలు కల్పించాం. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. తెలంగాణలో(sridhar Babu) కార్యకలాపాల విస్తరణ, వివిధ రంగాల్లో తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఒరికా సంస్థ సిఈఓ, ఎండి సంజీవ్ గాంధీ తెలిపారు. ఆస్ బయోటెక్ 2025 ఇంటర్నేషన్ కాన్ఫరెన్స్ కీలకోపన్యాసం చేసేం దుకు ఆస్ట్రేలియాకు విచ్చేసిన మంత్రి శ్రీధర్ బాబును కంపెనీ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870