అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం మత్తులో డ్రైవింగ్, రూల్స్ పాటించకుండా చేసే డ్రైవింగ్.. ఇవన్నీ ప్రాణాపాయమే. అయినా సరే చాలా మంది మాట వినరు. మంచిని మైండ్‌కి ఎక్కించుకోరు. ఎవరేమంటే మాకేం.. దూసుకుపోతాం అనుకుంటారు.. కానీ ఏదో ఒక సందర్భంలో.. వాళ్లను మృత్యువు మింగేస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో కొత్త ప్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం ముగ్గురి ప్రాణాలు తీసింది. ఆ ముగ్గురూ మైనర్లే. అతివేగమే ఆ స్నేహితుల ప్రాణం తీసిందని సమాచారం.

బహదూర్ పూరాకి చెందిన మైనర్లు.. బైక్‌పై త్రిపుల్ రైడింగ్ చేశారు. బహదూర్ పురా నుంచి ఆరాంఘర్ వైపు కొత్త ఫ్లై ఓవర్‌పై బయలుదేరారు. శివరాంపల్లి సమీపంలోకి రాగానే బైక్ ఎలక్ట్రిక్ ఫోల్‌ని ఢీ కొట్టింది. అతివేగంలో కంట్రోల్ చెయ్యలేకపోయారు. ఆ తర్వాత ఢీవైడర్‌ను ఢీ కొట్టింది. తీవ్ర గాయాలపాలై స్పాట్‌లోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు మరో మైనర్‌ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయినా మార్గమధ్యలోనే అతను చనిపోయాడని డాక్టర్లు తెలిపారు.