తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభం నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, మహిళా సంఘాల ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులతో సీఎం సమీక్ష నిర్వహించారు.
Read Also: Artificial intelligence : ఎఐతో భాషాభివృద్ధి సాధ్యమేనా?

ఈ సమయంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆంగ్లంలో వివరాలు చెప్పడం ప్రారంభించగా, సీఎం రేవంత్ వెంటనే మధ్యలో జోక్యం చేసుకుని తెలుగులో మాట్లాడాలని సూచించారు. ఈ సమావేశంలో(Meeting) సర్వసాధారణ మహిళలు కూడా ఉన్నందున అందరికీ అర్థమయ్యేలా తెలుగులో వివరాలు ఇవ్వడం మంచిదని ఆయన చెప్పారు. దీంతో కలెక్టర్ వెంటనే భాష మార్చి తెలుగులో సమాచారం అందించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: