South Central Railway : బాధ్యతలు చేపట్టారు. సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో సత్యప్రకాష్ బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ రైల్వే (Indian Railway) సర్వీస్ ఆఫ్ ఇంజనీర్స్ (ఐ.ఆర్.ఎస్.ఈ) క్యాడర్కు చెందిన ఆయన అంతకుముందు దక్షిణ మద్య రైల్వేలో చీర్అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (కన్స్ట్రక్షన్స్)గా పనిచేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐ.ఐ.టి), ఢిల్లీ నుండి సివిల్ ఇంజనీరింగ్ లో (Civil Engineering) బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీని కలిగి ఉన్నారు. భారతీయ రైల్వేలలో 35 సంవత్సరాలు విశిష్ట సేవలో అనేక ముఖ్యమైన పదవులను నిర్వహించారు. డైరెక్టర్/విజిలెన్స్ /రైల్వే బోర్డు, ప్రాజెక్టు ఇంచార్/ఐ.ఆర్.సి.ఓ.ఎన్/మలేషియా, డైరెక్టర్/ ట్రాక్/ఆర్.
డి.ఎస్.ఓ మొదలైన వాటికలో కీలక బాధ్యతలను నిర్వహించారు. పశ్చిమ రైల్వేలో సురేందర్ నగర్లో అసిస్టెంట్ ఇంజనీర్ గా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన, నార్త్ సెంట్రల్ రైల్వేలో కూడా సేవలందించారు. నిర్వహించిన కొన్ని ఇతర ముఖ్యమైన పదవులలో అలహాబాద్లోని సెంట్రల్ ఆర్గనైజేషన్ ఫర్ రైల్వే ఎలక్ట్రిఫికేషన్(కోర్)కు ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్ గా, పూణేలోని ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిటిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజనీ రింగ్(ఇరికెన్)కు డీన్గా సేవలను అందించారు.

సింగపూర్లోని ఐ.ఎన్.ఎస్.ఈ.ఎ.డి, మలేషి యాలోని ఐ.సి.ఎల్.ఐ.ఎఫ్లలో శిక్షణ పొందారు. అలహాబాద్లోని సెంట్రల్ ఆర్గనైజేషన్ ఫర్ రైల్వే ఎలక్ట్రి ఫికేషన్లో ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నప్పుడు ప్రతిష్టాత్మక రైల్వే మంత్రి అవార్డు లభించింది. గిర్డర్ వంతెనలపై లాంగ్ వెల్డెడ్ రైల్పై మూడు సాంకేతిక పత్రాలను ప్రచురించారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ MORE :