సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రత్యేక సౌకర్యాలు ప్రకటించింది. పండుగ సమయంలో రద్దీని దృష్టిలో ఉంచి, జనవరి 7 నుంచి 12వ తేదీ వరకు అదనంగా 11 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రత్యేక రైళ్లు కాకినాడ, వికారాబాద్, పార్వతీపురం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య రాకపోకలు నిర్వహిస్తాయి.
Read Also: Telangana: మందుబాబులకు బంపర్ ఆఫర్?

ప్రధానంగా కాకినాడ టౌన్-వికారాబాద్(Vikarabad) (07186, 07460) మరియు వికారాబాద్-కాకినాడ టౌన్ (07185, 07187) మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడతాయి. అలాగే వికారాబాద్-పార్వతీపురం (07461), పార్వతీపురం-వికారాబాద్ (07462), పార్వతీపురం-కాకినాడ టౌన్ (07463), సికింద్రాబాద్-పార్వతీపురం (07464, 07465) మార్గాల్లో కూడా సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లలో ఏసీ, స్లీపర్, జనరల్ కోచ్‌లు ఉంటాయని, రిజర్వేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు.
విజయవాడ మార్గం ద్వారా ప్రత్యేక రైళ్లు
అదే సమయంలో విజయవాడ మార్గం ద్వారా కూడా కొన్ని ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. విశాఖపట్నం-చర్లపల్లి (08511) స్పెషల్ రైలు జనవరి 10, 12, 17, 19 తేదీల్లో సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.15కు చర్లపల్లి చేరుతుంది. తిరిగి వెళ్ళే రైళ్లు 11, 13, 18, 20 తేదీల్లో అందుబాటులో ఉంటాయి. అలాగే అనకాపల్లి-వికారాబాద్ ప్రత్యేక రైలు (07416) జనవరి 18న రాత్రి 9.45కు బయలుదేరనుంది. పండుగ సమయంలో ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉన్నందున ఈ ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేయబడ్డాయని అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: