हिन्दी | Epaper

KTR : మనకు ఉన్న అస్త్రం సోషల్ మీడియానే కేటీఆర్

Sudheer
KTR : మనకు ఉన్న అస్త్రం సోషల్ మీడియానే కేటీఆర్

హైదరాబాద్ ఉప్పల్ సమీపంలోని మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్‌లో జరిగిన బీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి సదస్సులో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కొందరి గొంతులు ఒక్కసారిగా పెరిగిపోయాయని, అలాంటివారిని ఎదుర్కొనే అస్త్రం సోషల్ మీడియా మాత్రమేనని పేర్కొన్నారు. “మీ ముందున్న అన్యాయాన్ని సోషల్ మీడియాలో పెట్టండి, ఒక్కోరూ ఒక్కో కేసీఆర్‌లా బలంగా నిలవండి” అని కార్యకర్తలను ఉద్దేశించి పిలుపునిచ్చారు. మీడియా పేరుతో కొన్ని స్లాటర్ హౌస్‌లు పనిచేస్తున్నాయని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

బనకచర్ల కుట్రలు – చంద్రబాబు, రేవంత్, మోదీపై ఘాటు విమర్శలు

తెలంగాణ రాష్ట్రంలోని కీలక అంశాలపై కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నట్లు కేటీఆర్ ఆరోపించారు. గోదావరి నదిలో తెలంగాణకు 968 టీఎంసీల నికర జలాల్లో హక్కు ఉండటం కూడా కాంక్రీట్ నిజమని చెప్పారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు మాటలు వింటూ పాలన చేస్తున్నారని, మోదీ జుట్టు చంద్రబాబు చేతిలో ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్వీ చేస్తున్న ఉద్యమం అభినందనీయమని కొనియాడారు. బీఆర్ఎస్ ఉంటేనే తెలంగాణ హక్కులు నిలబడతాయని స్పష్టం చేశారు.

తప్పిన హామీలు, మోసపోయిన ప్రజలు – కాంగ్రెస్ పై ప్రజల్లో అవగాహన అవసరం

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress) ఇచ్చిన హామీలన్నీ మాటలకే పరిమితమయ్యాయని కేటీఆర్ ఆరోపించారు. రైతుబంధు హామీని మరిచిపోయారని, రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి కేసీఆర్, కేటీఆర్‌లను తొలగించమని చెప్పిన కాంగ్రెస్ అసలు ఏదీ నెరవేర్చలేదని విమర్శించారు. ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం, రూ.50,000 హామీ ఇచ్చి చివరకు ఏడుగురికీ ఇవ్వలేదని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం డైవర్షన్‌కి కాంగ్రెస్ వినియోగిస్తుందని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ కుట్రలను గుర్తించి భవిష్యత్తులో బీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు.

Read Also ; BRS Merge with BJP : సీఎం రమేష్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870