ఉమ్మడి నల్లగొండ జిల్లా సస్యశ్యామలానికి ప్రణాళికలు
హైదరాబాద్ : ఎస్ఎల్బిసి (SLBC) 2027 డిసెంబర్ మాసాంతానికి పూర్తి చేసి 4లక్షల ఎకరాలకు సాగునీరు సమృద్ధిగా అందించడంతో పాటు త్రాగునీరుఅందిస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖామంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ (N.Uttam Kumar) రెడ్డి ప్రకటించారు. మంగళవారం జలసౌధలో నల్లగొండ, భువనగిరి లోకసభ నియోజకవర్గాలలో ప్రాజెక్టుల పురోగతిపై ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్షలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఎస్ఎల్బిసి పునరుద్దరణ అంశంపై నీటిపారుదల శాఖా ఇంజినీర్లు రూపొందించిన నివేదికను ఈ నెల 15న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో చర్చించి మంత్రివర్గ ఆమోదంతో పనులు మొదలు పెడతామని ఆయన స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన టన్నెల్1, పెండ్లిపాకల రిజర్వాయర్, టన్నెల్ 2 ను పూర్తి చేసుకుని 25 కిలో మీటర్ల మెయిన్ కెనాల్ ద్వారా హైలెవల్ కేనాల్ లో కలిపి సాగునీటిని అందిస్తామన్నారు. అందుకు సంబంధించిన ముసాయిదా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

News Telugu
80 వేల ఏకరాలకు సాగు నీరు
యస్.ఎల్.బి.సి (SLBC) పూర్తి అయితే హైలెవల్ కెనాల్ ద్వారా రెండులక్షలు, ఉదయసముద్రం ద్వారా లక్ష ఎకరాలకు, లో లెవల్ కెనాల్ ద్వారా 80 వేల ఏకరాలకు సాగు నీరు మారుమూల గ్రామాలకు సురక్షిత త్రాగునీరు అందిస్తామని పునరుద్ఘాటించారు. అదే విదంగా డిండి ఎత్తిపోతల పధకం పూర్తి చేయడం ద్వారా 8 రిజర్వాయర్ల నుండి 3.61 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా పనులు సాగుతున్నాయన్నారు. సింగరాజ్ పల్లి (Singaraj Pally) రిజర్వాయర్ ద్వారా 13వేల ఎకరాలకు, ఎర్రబెల్లిగోకారం ద్వారా ఆరువేల ఎకరాలకు, ఇర్శిన్ ద్వారా 10 వేల ఎకరాలకు, గొట్టెముక్కూల ద్వారా 28 వేల ఏకరాలకు, చింతపల్లి ద్వారా 15 వేల ఎకరాలకు, కృష్ణరాంపల్లి ద్వారా లక్ష ఏకరాలకు, శివన్నగూడెం ద్వారా లక్షాయాబైవేల ఎకరాలకు అందించేందుకు గాను పనులు వేగవంతం చేస్తున్నామని ఆయన చెప్పారు.
SLBCలో ఎన్ని టన్నెల్స్ ఉన్నాయి?
SLBCలో ప్రధానంగా రెండు టన్నెల్స్ ఉంటాయి –
- టన్నెల్-1: పెండ్లిపాకల రిజర్వాయర్ వరకు.
- టన్నెల్-2: అక్కడి నుండి ప్రధాన కాల్వలో కలుపుతుంది.
SLBC టన్నెల్ పొడవు ఎంత?
రెండు టన్నెల్స్ కలిపి సుమారు 43 కిలోమీటర్ల వరకు తవ్వకాలు జరగనున్నాయి. ఇది దేశంలోనే అతిపెద్ద నీటి టన్నెల్ ప్రాజెక్టులలో ఒకటి.
Read Hindi news: Hindi.vaartha.com
Read Also: