sirpur maoists arrest : దేశవ్యాప్తంగా మావోయిస్టులపై భద్రతా బలగాల దృష్టి కొనసాగుతోంది. ఈ క్రమంలో తెలంగాణలోని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్-యు అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి పోలీసులు భారీ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 16 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
పోలీసు నిఘా విభాగం నుంచి అందిన పక్కా సమాచారంతో ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బలగాలు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టాయి. ఈ సందర్భంగా 9 మంది మహిళలు, 7 మంది పురుషులు కలిపి 16 మంది మావోయిస్టులు పట్టుబడ్డారు. అరెస్టయిన వారిలో రాష్ట్ర స్థాయి కేడర్ కలిగిన బడె చొక్కారావు అలియాస్ దామోదర్ ఉన్నట్లు సమాచారం. జిల్లాలో మావోయిస్టుల చలనం తగ్గిందని భావిస్తున్న సమయంలో ఇంత పెద్ద సంఖ్యలో అరెస్టులు జరగడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read also: TG Panchayat Elections: మూడవ విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం
ఇదిలా ఉండగా, సుమారు 30 ఏళ్ల క్రితం (sirpur maoists arrest) అజ్ఞాతంలోకి వెళ్లిన తన కుమారుడు పోలీసులకు చిక్కాడన్న వార్త తెలిసి దామోదర్ తల్లి భావోద్వేగానికి లోనయ్యారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆమె, తన కుమారుడిని ప్రాణాలతో చూస్తానో లేదో అనే ఆందోళన ఎప్పుడూ ఉండేదని, పోలీసులకు దొరికాడన్న వార్త ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. తన కుమారుడిని తనకు అప్పగించాలని ఆమె పోలీసులను వేడుకున్నారు.
మరోవైపు, పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టులను వెంటనే కోర్టులో హాజరుపరచాలని తెలంగాణ పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది. అరెస్టయిన వారిని చట్టబద్ధంగా కోర్టులో ప్రవేశపెట్టాలని, వారి ప్రాణాలకు ఎలాంటి హాని జరగకుండా చూడాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్. నారాయణరావు కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: