సింగరేణి(Singareni) సంస్థ ఇంచార్జ్ సిఎండిగా ఐఎఎస్ అధికారి కృష్ణభాస్కర్ నియమితులయ్యారు. ప్రస్తుత ఇంచార్జ్ సిఎండి బలరాం డిప్యుటేషన్ గడువు ముగియడంతో ఆయన స్థానంలో కృష్ణభాస్కర్ బాధ్యతలు చేపట్టారు. కేంద్ర రెవెన్యూ సర్వీస్ నుంచి డిప్యుటేషన్పై తెలంగాణ(Telangana)కు వచ్చిన బలరాం.. సింగరేణిలో సంచాలకుడిగా, ఇంచార్జ్ సిఎండిగా ఆరు సంవత్సరాల పాటు పని చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన అధికారులకు డిప్యుటేషన్ గడువు సాధారణంగా ఐదేళ్లే ఉంటుంది.
Read also: TG Panchayat Elections: మూడవ విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం

సింగరేణిలో పరిపాలనా మార్పులు
అంతకు మించి ఏడాది అదనంగా ఉన్నందున మరోసారి గడువు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరలేదు. ఆయన స్థానంలో తెలంగాణకు చెందిన సీనియర్ ఐఏఎస్ లేదా ఐపిఎస్ అధికారిని రెగ్యులర్ సిఎండిని నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ ప్రస్తుతం ప్రభుత్వం రెగ్యులర్ సిఎండిని కాకుండా ఇన్చార్జి సిఎండిని నియమించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: