నోటీసులిచ్చిన బాధితులపై ఇడి ఆరా
హైదరాబాద్ : గొర్రెలే లేవు…కానీ కొనుగోలు చేసినట్లు రికార్డులు.. అమాయకులను వంచించి వేల కోట్ల రూపాయాలను అప్పన్నంగా దోచుకున్న కేసును ఏసిబి (ACB) మరింత వేగవంతం చేసింది. పశుసంవర్ధక శాఖకు చెందిన సీనియర్ అధికారులు ఇప్పటికే ఆరెస్టు కాగా.. అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) ఓఎన్టిపైన సైతం కేసు నమోదు అయ్యింది. గొర్రెల స్కామ్లో ఈడీ నోటీసులిచ్చిన విచారణకురాకుంటే సీరియస్ గా తీసుకుంది.
అయితే గొర్రెల స్కామ్ కేసులో మరో పక్క
నోటీసులందుకున్న బాధితులందరూ విచారణకు రావాల్సిందే అంటూ తాజాగా బాధితులకు ఈడీ (Ed) నోటీసులు ఇచ్చింది. ఈనెల 15న విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో ఆదేశించింది. అయితే గొర్రెల స్కామ్ కేసు (Sheep Scam Case) లో మరో పక్క ఏసీబీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఏసీబీ విచారణ ఆధారంగానే ఈడీ సైతం దర్యాప్తును లోతుగా చేస్తుంది. ఏపీకి చెందిన గొర్రెల కాపరులకు రూ.2 కోట్లు ఎగవేసిన బ్రోకర్లు ప్రభుత్వ పథకం నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అధికారులు సైతం చేతులు కలిపి
వారితో అధికారులు సైతం చేతులు కలిపి కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారని ఏసీబీ ఆరోపిస్తోంది. గొర్రెలు కొనకుండానే కొన్నట్టు రికార్డులు తయారీ చేశారని.. వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని ఏసీబీ స్పష్టంగా చెబుతోంది. స్కాంలో పశుసంవర్ధక శాఖ (Animal Husbandry Department) కు చెందిన సీనియర్ అధికారులు ఇప్పటికే అరెస్టు చేశారు. తాజాగా బాధితులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడంతో ఈ కేసు వ్యవహారం కొలిక్కివచ్చే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: