हिन्दी | Epaper
ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు బాలుడు ఆత్మహత్య.. ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు బాలుడు ఆత్మహత్య.. ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు బాలుడు ఆత్మహత్య.. ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు బాలుడు ఆత్మహత్య..

Shadnagar: పక్క ప్లాన్ ప్రకారమే అక్కను హత్య చేసిన తమ్ముడు

Anusha
Shadnagar: పక్క ప్లాన్ ప్రకారమే అక్కను హత్య చేసిన తమ్ముడు

రాజకీయాలు, సినిమా, సోషల్ మీడియా, ఏ రంగమైనా సరే ఫేమస్ కావడం ప్రతి ఒక్కరి కలే. కానీ ఈ ఫేమస్ కావడమే ఇప్పుడు ఒక నిర్దోషి ప్రాణాన్ని బలి తీసుకుంది. షాద్‌నగర్‌లో చోటుచేసుకున్న పరువు హత్య కేసు ప్రస్తుతం సంచలనం రేపుతోంది. తనకంటూ పేరు తేచ్చుకునేందుకు హత్య చేయడమే మార్గమని భావించిన ఓ తమ్ముడు చేసిన క్రూరకాండ స్థానికులను షాక్‌కు గురిచేస్తోంది.సమాచారం ప్రకారం, షాద్‌నగర్‌ (Shadnagar) ప్రాంతానికి చెందిన రోహిత్ అనే యువకుడు తన అక్క రుచితను గొంతుకు వైర్ బిగించి హత్య చేశాడు రోహిత్. ఈ ఘటనకు ముందు రోహిత్ సోషల్ మీడియాలో రీల్స్ చేసినట్లు తెలుస్తోంది. ఆ రీల్స్‌లో అతడు “ఫేమస్ అవ్వాలి మామ… బాగా బతికి పేరు తెచ్చుకోవడం కష్టం… బాగా చంపి ఫేమస్ అవ్వాలి” అని పేర్కొన్నాడు. ఇది అతని మానసిక స్థితి ఎంత దారుణంగా ఉందో చూపిస్తోంది.

Ranga Reddy: పక్కా ప్లాన్ ప్రకారమే అక్కను హత్య చేరిన తమ్ముడు
Ranga Reddy

ఫేమస్ కావాలనే క్రూర యత్నం

అక్క రుచిత మరో వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతుందని కోపంతో రోహిత్ ఈ ఘోరానికి పాల్పడ్డాడు. ఇంట్లో ప్రేమ వ్యవహారంపై అనేకసార్లు గొడవలు జరిగాయని, రుచితను పలుమార్లు హెచ్చరించినట్లు సమాచారం. సంఘటన రోజు రుచిత (Ruchita) మరో వ్యక్తితో మాట్లాడుతుండటంతో కోపం అదుపు చేయలేకపోయాడు. చార్జింగ్ వైర్ తీసుకుని రుచిత మెడకు బిగించి ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఆమె ప్రాణం కోల్పోయిన తర్వాత ఏమీ తెలియనట్లు నటిస్తూ స్పృహ తప్పినట్లు కుటుంబసభ్యులకు ఫోన్ చేశాడు.వెంటనే అక్కడకు చేరుకున్న బంధువులు రుచిత మృతి పరిస్థితి చూసి షాక్ అయ్యారు. తండ్రి నిలదీయడంతో చివరికి తానే హత్య చేసినట్టు రోహిత్ ఒప్పుకున్నాడు. పోలీసులు ఈ కేసులో విచారణ కొనసాగిస్తున్నారు.

షాద్‌నగర్ పాత పేరు ఏమిటి?

షాద్‌నగర్‌కు పూర్వం జనంపేట అనే పేరు ఉండేది. 6వ నిజాం కాలంలో జనంపేట ప్రాంతాన్ని పాలించిన మహారాజా కృష్ణన్ ప్రసాద్ తన కలంపేరు ‘షాద్’ ద్వారా ప్రసిద్ధి చెందాడు. ఆయన పేరును ఆధారంగా చేసుకొని ఆ ప్రాంతానికి షాద్‌నగర్ అనే పేరు పెట్టబడింది.

షాద్‌నగర్ పట్టణ ప్రాంతమా లేక గ్రామీణ ప్రాంతమా?

షాద్‌నగర్‌లో పట్టణ, గ్రామీణ లక్షణాలు రెండూ ఉన్నాయి. ఇది రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉండటంతో నివాస, వాణిజ్య అభివృద్ధికి అనుకూలమైన ప్రాంతంగా ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: TG Rains: తెలంగాణలో నేడు పలు జిల్లాల్లో వర్ష సూచన

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870