హైదరాబాద్: రాష్ట్రంలో మిగిలిపోయిన భాషా పండి తులకు పదోన్నతులు కల్పించాలని భాషా పండితుల (Language Pandits) అసోసియేషన్స్ డిమాండ్ చేస్తున్నాయి. పాఠశాల విద్య శాఖ రాష్ట్రం లోని ఉపాధ్యాయులకు పదోన్నతుల (School Teachers Promotions) కోసం షెడ్యూల్ జారీ చేసిన నేపథ్యంలో గతంలో భాషా పండితుల నుంచి స్కూల్ అసిస్టెంట్స్ ఉన్నతీకరించగా వారిలో మిగిలిపోయిన మరో వెయ్యి మందికి పదోన్నతులు కల్పించాలని సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.

పదోన్నతులు కల్పించాలని డిమాండ్
పదోన్నతుల (School Teachers Promotions) షెడ్యూల్ ప్రకటించినందుకు ప్రభుత్వానికి స్టేట్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ (SLA) తెలంగాణ (Telangana) కృతజ్ఞతలు తెలిపింది. 2024లో పదోన్నతి పొందలేక మిగిలిపోయిన భాషా పండితులందరికీ పదోన్నతి కల్పించాలని ఎస్ ఎల్ఏ టిజి రాష్ట్ర అధ్యక్షులు చక్రవర్తుల శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి గౌరీ శంకర్ రావు డిమాండ్ చేశారు. మిగిలిన సబ్జెక్ట్స్ పరంగా కొన్ని సమస్యలు తలెత్తినా, మనోవేదనకు గురయ్యే భాషా పండితులకు మాత్రం తక్షణమే పదోన్నతి కల్పించాలన్నారు. విభజనకు ముందున్న జిల్లా కేంద్రాల్లో ఏర్పడ్డ ఇబ్బందులను సరిచూసి మిగిలిపోయిన భాషా పండితులకు వెంటనే పదోన్నతులు కల్పించాలన్నారు. పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యా యులకు వివిధ పండిత స్థాయిలలో పదోన్నతులకు పచ్చజెండా ఊపుతూ షెడ్యూల్ విడుదల చేయడం పట్ల రాష్ట్రీయ ఉపాధ్యాయ పరిషత్ తెలంగాణ (ఆర్ యుపిపి టిజి) హర్షం వ్యక్తం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: