కొన్నిసార్లు అదృష్టం మనం ఊహించనివిధంగా వరిస్తుంది. అప్పుడు ఎంత గొప్ప ఊరట లభిస్తుందో మాటలతో వర్ణించలేం. ఆ సంతోషమే వేరుగా ఉంటుంది. ఓ మామ తన కోడలు కోసం అమెరికా నుంచి వచ్చి ఓటు వేశారు. అయితేనేం ఆ మామ కోరిక నెరవేరి, కోడలు విజయాన్ని పొందింది. ఆ వివరాలు ఏమిటో మీరే చదివేయండి..
Read Also: Panchayat Elections: రేపు మూడో విడత పంచాయతీ పోలింగ్ ..2 రోజులు స్కూళ్లకు సెలవు

ఒక్కఓటు తేడాతో గెలిచిన కోడలు..
నిర్మల్ జిల్లా (Nirmal District) లోకేశ్వరం మండలం బాగాపూర్ గ్రామ (sarpanch) పంచాయితీ ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో విజయం సాధించింది ముత్యాల శ్రీవేద. తన కోడల్ని ఏవిధంగానైనా గెలిపించాలని అమెరికా నుంచి ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి తన సొంత గ్రామానికి చేరుకున్నారు. ఆ మామ ఆశయం నెరవేరింది. తన కోడలు ముత్యాల శ్రీవేద ఎన్నికల్లో నిలబడినందుకు మామ ముత్యాల ఇంద్రకర్ రెడ్డి నాలుగురోజులు ముందే అమెరికా నుంచి స్వగ్రామానికి వచ్చి, ఓటు వేశారు. ఎన్నికల ఫలితాల్లో ముత్యాల శ్రీవేదకు 426 ఓట్లకుగాను 378 పోలవ్వగా.. శ్రీవేదకు 189 ఓట్లు వచ్చాయి. ఆమె ప్రత్యర్థి హర్షస్వాతికి 188 ఓట్లు వచ్చాయి, చెల్లని ఒక్క ఓటు పడింది. దీంతో విజేతగా ముత్యాల శ్రీవేద నిలిచింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: