రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల(Sarpanch Elections) సైకిల్ మొదలైంది. ఈ ‘కుర్చీల ఆట’లో ఏ పార్టీ పట్టు సాధిస్తుందో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారనే అంశంపైనే విజయావకాశాలు పూర్తిగా ఆధారపడి ఉన్నాయి. పంచాయతీ ఎన్నికలు అనగానే ప్రధానంగా అందరి దృష్టి సర్పంచ్ పదవిపైనే ఉంటుంది. అయితే, ఒక గ్రామంలో పూర్తిస్థాయి పట్టు సాధించాలంటే, కేవలం సర్పంచ్ పదవిని మాత్రమే కాక, మిగిలిన వార్డు మెంబర్ల స్థానాలను కూడా గెలుచుకోవడం అత్యంత కీలకం.
Read Also: Banks: అమరావతిలో కొలువుదీరనున్న దిగ్గజ బ్యాంకులు

మెజారిటీ సభ్యులే కీలకం: పార్టీల ఆలోచన
రాజకీయ పార్టీల దృష్టిలో, సర్పంచ్ పదవిని(Sarpanch Elections) గెలుచుకున్నా కూడా మెజారిటీ వార్డు సభ్యులు తమకు అనుకూలంగా లేకపోతే అనేక ప్రతికూలతలను ఎదుర్కోవాల్సి వస్తుంది. గ్రామంలో ఏ పని చేయాలన్నా, ఏదైనా తీర్మానం ఆమోదించాలన్నా, పంచాయతీ తీర్మానం ముఖ్యంగా మారుతుంది. దీనికి మెజారిటీ వార్డు సభ్యుల ఆమోదం తప్పనిసరి. అందుకే, సర్పంచ్ పదవితో పాటు తమ మద్దతుదారులే వార్డు మెంబర్లుగా గెలిచేలా పార్టీలు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.
ఓటర్ల ప్రసన్నం: వేరు వేరు ఓట్లపై దృష్టి
పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటరు సర్పంచికి ఒక ఓటు, వార్డు మెంబర్కు మరో ఓటు వేస్తారు. ఇక్కడే పార్టీలకు సవాలు ఎదురవుతుంది. ఒకే పార్టీ మద్దతుతో బరిలో ఉన్న అభ్యర్థులకే ఓటర్లు రెండు ఓట్లను వేస్తారనే గ్యారెంటీ లేదు. ‘చేరో ఓటు వేద్దాం’ అని ఓటర్లు భావించే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, గ్రామంపై పూర్తిస్థాయి పట్టు కోసం సర్పంచ్, వార్డు సభ్యుల రెండు పదవులను గెలుపొందేలా ప్రధాన పార్టీలు ప్రత్యేక వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
అభ్యర్థుల ఎంపిక, తొలి విడతపై ప్రత్యేక దృష్టి
ఎంపిక బాధ్యత: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, వామపక్షాలు సహా ప్రధాన పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ప్రారంభించాయి. రిజర్వేషన్ల ఆధారంగా గెలుపు అవకాశాలు ఉన్న వారి పేర్లను సూచించాలని మండల, గ్రామస్థాయి ముఖ్య నాయకులకు ఆదేశాలు ఇచ్చారు. కాంగ్రెస్లో ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్లో నియోజకవర్గ ఇన్ఛార్జిలు తుది ఎంపిక బాధ్యతను తీసుకుంటున్నారు.
తొలి విడత కీలకం: డిసెంబరు 11వ తేదీన తొలి విడతతో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. అదే రోజున ఫలితాలు వెలువడనున్నాయి. ఈ తొలి విడత ఫలితాలు తర్వాత జరిగే రెండు, మూడో విడత ఎన్నికల ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే మొదటి విడతలో సత్తా చాటాలనే లక్ష్యంతో నాయకులు ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: