తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలుకాకముందే ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలు టికెట్ ధరలతో ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి. (Sankranti) పండగ కోసం సొంతూళ్లకు వెళ్లే వారి అవసరాలను ఆసరాగా చేసుకుని అడ్డగోలుగా ఛార్జీలు పెంచేస్తున్నాయి. రవాణా శాఖ నిబంధనలను లెక్కచేయకుండా అప్పుడే పండగ దందా’కు తెరలేపాయి.
Read also: Hindu Dharmam : హిందూ ధర్మంపై మాట్లాడితే ఇస్లాంకు వ్యతిరేకమని కాదు – పవన్

టికెట్ ధర గరిష్టంగా పెంపు
సాధారణ రోజుల్లో హైదరాబాద్ (Hyderabad) నుంచి విజయవాడకు రూ. 700 గా ఉండే బస్సు ఛార్జీని.. పండగ వేళ రూ. 2,700 నుంచి రూ. 4,000 వరకు పెంచేశారు. (Sankranti) రైళ్లలో రిజర్వేషన్లు దొరకకపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీన్ని సొమ్ము చేసుకుంటున్న ట్రావెల్స్ యాజమాన్యాలు సీటు ఉన్న స్థానాన్ని బట్టి (ముందు, మధ్య, వెనుక) వేర్వేరు ధరలు వసూలు చేస్తూ ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. కేవలం ఆదాయమే లక్ష్యంగా ప్రైవేటు బస్సులు ఇష్టానుసారంగా రోడ్లపైకి వస్తున్నాయి. ఇటీవల వరుస ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో, డ్రైవర్ల అనుభవం, బస్సుల ఫిట్‌నెస్‌పై తనిఖీలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రమాదాలు జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే, ముందస్తుగా రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి కఠినంగా వ్యవహరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com