తనపై ఫిర్యాదు చేశారన్న కోపంతో..
సంగారెడ్డి జిల్లా (Sangareddy) సిర్గాపూర్‌లోని ఎస్సీ బాలుర సంక్షేమ వసతి గృహంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, వారిని వేధిస్తున్న వార్డెన్ కిషన్ నాయక్ ప్రవర్తన సంచలనం సృష్టించింది. అతడి తీరుతో విసిగిపోయిన విద్యార్థులు గురువారం రాత్రి కడ్పల్–సిర్గాపూర్ రహదారిపై ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే హాస్టల్‌కు చేరుకుని విచారణ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వార్డెన్‌పై తమ ఆరోపణలను రాతపూర్వకంగా ఫిర్యాదుగా అందజేశారు. ఘటనపై అధికారులు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Read also: Telangana Assembly : రేపు అసెంబ్లీలో కృష్ణా జలాలపై ప్రభుత్వం PPT

వార్డెన్‌ను సస్పెండ్ చేసిన కలెక్టర్
దీంతో ఆగ్రహానికి గురైన వార్డెన్, (Sangareddy) శుక్రవారం ఉదయం మద్యం మత్తులో వసతి గృహానికి చేరుకుని విద్యార్థులపై బూతులతో రెచ్చిపోయాడు. అంతటితో ఆగకుండా, హాస్టల్ సిబ్బందికి ఫోన్ చేసి.. నా మీదనే ఫిర్యాదు చేస్తారా? వాళ్ల అన్నంలో విషం కలిపి చంపేయండి అంటూ ఆదేశాలు జారీ చేశాడు. ఈ సంభాషణకు సంబంధించిన ఆడియో రికార్డింగ్ బయటకు రావడంతో సర్వత్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ ఉదంతంపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తక్షణమే స్పందించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించడమే కాకుండా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడాలని చూసిన వార్డెన్ కిషన్ నాయక్‌ను సస్పెండ్ (Suspended) చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com