హైదరాబాద్ : విజిలెన్స్ ఎన్ఫోర్సుమెంట్ ఆర్ వైపురం యూనిట్ సంగారెడ్డి(Sangareddy DST) జిల్లాలోని కడ్పల్ గ్రామంలోని సామ్రాట్ ఫుడ్ ఇండస్ట్రీ, మార్తీ గ్రామంలోని వెంకటేశ్వర ఆగ్రోస్ ఇండస్ట్రీస్లో సోమ వారం అర్థరాత్రి వరకు తనిఖీలు నిర్వహించి రూ.10,24,23,777 విలువ కలిగిన సిఎంఆర్ ధాన్యం అక్రమంగా నల్లబజారుకు తరలించారని గుర్తించి కేసులు నమోదు చేసినట్లు విజిలెన్స్ ఎన్ఫోర్సు మెంట్ తెలంగాణ డైరెక్టర్ జనరల్ శిఖా గోయల్ తెలిపారు. విశ్వసనీయ సమాచారంతో ఆర్సిపురం విజిలెన్స్, ఎన్ఫోర్స్ మెంట్(Enforcement) యూనిట్ సంగారెడ్డి జిల్లా, సిర్గాపూర్ మండలం కడ్పల్ గ్రామం లోని సామ్రాట్ ఫుడ్ ఇండస్ట్రీస్ లో సోమవారం అర్థరాత్రి నుంచిన ఆకస్మిక తనిఖీ సివిల్ సప్లయ్ అధికారులతో కలిసి నిర్వహించి కస్టమ్ మిల్లింగ్ కోసం రబీ, ఖరీప్ 2024-24లో ఇచ్చిన 40,834.98 క్వింటాళ్ల ధాన్యం మళ్ళించారని గుర్తించారు.
Read also : Karumuri Venkata Reddy : వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకట రెడ్డి కి బెయిల్

మిల్లులో ఉండాల్సిన బస్తాల కంటే 1,02,087 బస్తాలు నిల్వ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.9,47,37,153 ఉంటుందని వివరించారు. రెండో నిఘా బృందం కల్హేర్ మండలం, మార్డి గ్రామం లోని వెంకటేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్లో తనిఖీ చేశారు. అక్కడ ఖరీఫ్ 2024-25 సీజన్కు సంబంధించిన 3313 క్వింటాళ్ల సిఎంఆర్ ధాన్యం 8283 బస్తాలు నిల్వ తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. దీని విలువ సుమారు రూ.76,86,624 ఉంటుందని తెలిపారు. మిల్లర్పై తదుపరి చర్యలు ప్రారంభించేందుకు సంగారెడ్డి జిల్లా పౌర సరఫరాల అధికారులకు మెమో జారీ చేశారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read also :