హైదరాబాద్ నగరంలో జనవరి 1 వరకు ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ అమల్లో ఉంటుందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్(Sajjanar) స్పష్టం చేశారు. 2025 వార్షిక నేర నివేదిక విడుదల సందర్భంగా ఆయన పౌరులకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. మద్యం సేవించి వాహనం నడిపి పట్టుబడితే జైలు శిక్ష తప్పదని ఆయన తేల్చి చెప్పారు.
Read Also: Nizamabad: ATM దుండగులు కలకలం: రాత్రికి రాత్రి రూ. 30 లక్షలు మాయం

నూతన సంవత్సరం నేపథ్యంలో ఇప్పటికే నగరవ్యాప్తంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. కఠిన చర్యల ఫలితంగా ఈ ఏడాది హైదరాబాద్‌లో మొత్తం నేరాల సంఖ్య సుమారు 15 శాతం తగ్గినట్లు వెల్లడించారు. అలాగే పోక్సో కేసులు కూడా గతంతో పోలిస్తే తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు. డ్రగ్స్ నియంత్రణపై కూడా పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారని సజ్జనార్(Sajjanar) చెప్పారు. మొత్తం 368 కేసుల్లో దాదాపు రూ.6.45 కోట్ల విలువైన మత్తు పదార్థాలను సీజ్ చేసినట్లు వివరించారు. ప్రజలు చట్టాలను పాటిస్తూ భద్రతకు సహకరించాలని ఆయన కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: