శబరిమల యాత్ర (Sabarimala) ముగించుకుని తిరిగి వెళ్తున్న భక్తుల కారును ఎదురుగా వస్తున్న కంటెయినర్ ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు భక్తులు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఎల్బీనగర్ కు (LB Nagar) చెందిన చీర్ల అశోక్ కుమార్ (50), అతని కుమారుడు ధీరజ్ (23), బంధువులు ప్రదీప్ (29), రాజశేఖర్ (40)తో కలిసి అయ్యప్ప మాల ధరించి శబరిమల యాత్రకు వెళ్లారు.
Read also: Hyderabad: ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

కారును కంటెయినర్ ఢీ కొట్టింది
దర్శనం అనంతరం బుధవారం ఉదయం కొచ్చి విమానాశ్రయానికి వెళ్లేందుకు టాక్సీ మాట్లాడుకున్నారు. (Sabarimala) తెల్లవారుజామున కొచ్చి సమీపంలో కారును కంటెయినర్ ఢీకొనడంతో కారు డ్రైవర్ తో, పాటు అశోక్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com