హైదరాబాద్ : రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు బీమా పథకం(Rythu BimaApp) కోసం మొబైల్ యాప్ అందుబాటులోకి రానుంది. రైతు బీమా పధకం అమలులో సాంకేతిక సమస్యలను నివారించి సజావుగా అమలు చేసేందుకు వ్యవసాయ శాఖ నేతృత్వంలో ఈ యాప్ను రూపొందిస్తున్నారు. త్వరలోనే దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ యాప్ను అధికారుల సూచనలకు అనుగుణంగా రూపొందిస్తున్నారు. యాప్ ద్వారా రైతులు, నామినీల వివరాల నమోదుతో పాటు మరణ ధ్రువీకరణ పత్రాలను అప్లోడ్ చేస్తే ఆ వెంటనే బీమా సాయం చెల్లింపులు సులభంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు బీమా పథకాన్న అమలు చేస్తోంది.
Read Also: D.C.M. Bhatti: సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఢిల్లీకి రావడానికి సిద్ధం

రాష్ట్రవ్యాప్తంగా 18 నుంచి 60 ఏళ్ల లోపు వయసు రైతు ఏ కారణంతోనైనా చనిపోతే ఆ కుటుంబానికి ఈ పథకం(Rythu BimaApp) కింద రూ. 5 లక్షల సాయాన్ని ప్రభుత్వం చెల్లిస్తోంది. అయితే రైతులకు అమలు చేస్తున్న ఈ బీమా పథకం అమలులో పలు సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతుండటంతో పలువురు బాధిత రైతు కుటుంబాలకు ఈ సాయం అందడం లేదు. ప్రధానంగా రైతు బీమాకు సంబంధించి వయోపరిమితి సమస్యతో పాటుగా ఆధార్లో తప్పులు, నామినీ పేర్లు సరిగా నమోదు కాకపోవడం వంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇటు మరణ ధ్రువీకరణ పత్రాలు కూడా సకాలంలో అందకపోవడంతో రైతు కుటుంబాలకు సాయం అందని పరిస్థితులు ఉన్నాయి. అలాగే కొత్తగా బీమా కోసం నమోదు చేసుకునేందుకు రైతులకు సమస్యలు ఎదురవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు యాప్ అవసరమని వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: