తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అమలు చేస్తున్న ‘రైతు భరోసా’ (Rythu Bharosa)పథకం పంపిణీ ఇవాళ్టితో పూర్తి కానుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో “రైతు భరోసా సంబరాలు” నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం (Telangana Govt) తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు రైతు నేస్తం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నారు.
రైతు నేస్తం కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు
ఈ రోజు సాయంత్రం 4 గంటలకు, హైదరాబాద్ సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో మండలాల్లో రైతులు పాల్గొననున్న ప్రత్యేక కార్యక్రమం “రైతు నేస్తం”ను నిర్వహించనున్నారు. ఇందులో 2,000 మంది రైతులు పాల్గొననున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా రైతులతో నేరుగా సంభాషించి, వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నామని తెలిపారు.
కేవలం 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతులకు
రైతు భరోసా పథకం కింద కేవలం 9 రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం రూ.9వేల కోట్లను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం విశేషమని మంత్రి పొంగులేటి తెలిపారు. రైతుల ఆర్థిక భద్రతకు ఇది పెద్ద ఊతమని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా రైతులు అప్పుల ఊబిలో నుంచి బయటపడే అవకాశం ఉందని, భవిష్యత్తులో మరిన్ని వ్యవసాయపరమైన ప్రోత్సాహక కార్యక్రమాలు తీసుకువస్తామని తెలిపారు. రైతులు ప్రభుత్వంపై నమ్మకం పెంచుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
Read Also : Iran-Israel War : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ముగిసింది – ట్రంప్