తెలంగాణ రాష్ట్రంలో బీఎస్‌సీ పథకం అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen) తీవ్రంగా మండిపడ్డారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ పథకానికి నిధులు విడుదల చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఈ పథకం కింద చదివే పిల్లలు అత్యంత పేద కుటుంబాలవారని, వారి భవిష్యత్తు కోసం ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన హితవు పలికారు.
“పేదల భవిష్యత్తు చీకట్లో నెట్టకూడదు” – ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
పేదల భవిష్యత్తు కోసం గత ప్రభుత్వాలు చేసిన సంకల్పాలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని విమర్శించారు. కేవలం రూ.150 కోట్ల బకాయిలే ఉండగా, విద్యార్థుల చదువులకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ – “మీకు పేదల చదువులపై ప్రేమ లేదా? లేక రాష్ట్రానికి ఆ మొత్తాన్ని ఖర్చు చేసే స్థోమత లేదా?” అని ప్రశ్నించారు.
“అక్రమ కేసులకు కోట్లు.. విద్యకు మాత్రం నిధుల్లేవా?”
రాష్ట్ర ప్రభుత్వం అందాల పోటీలు, మహిళా దినోత్సవాల వంటి వేడుకల కోసం కోట్లు ఖర్చు చేస్తోందని, కానీ పేద విద్యార్థుల కోసం మాత్రం నిధులు లేదనడం అత్యంత దురదృష్టకరమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. పేద ప్రజలే ఓటు వేసి అధికారంలోకి తీసుకొచ్చారన్న విషయాన్ని మర్చిపోరాదని హితవు పలికారు. విద్యకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ప్రజలు మళ్లీ నైతిక బుద్ధిని నేర్పుతారని హెచ్చరించారు.
Read Also : Nara Lokesh : గన్నవరంలో ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ కార్యాలయాన్ని ప్రారంభించిన లోకేశ్