కాంగ్రెస్ పథకాలలో ఒకటైన “ఇందిరమ్మ ఆత్మీయ భరోసా” పథకం (Indiramma Atmiya Bharosa Scheme) కింద పెండింగ్‌లో ఉన్న నిధులను త్వరలో విడుదల చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ పథకం కింద జులై తొలి వారంలో లబ్దిదారుల ఖాతాల్లోకి రూ.6,000 చొప్పున జమ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకానికి భూమిలేని వ్యవసాయ కూలీలు అర్హులు కాగా, వారిలో ఇప్పటికే మొదటి విడతగా 83,887 మందికి రూ.6వేలు చొప్పున పంపిణీ పూర్తయింది.
రూ.261 కోట్ల నిధుల విడుదలకు సిద్ధం
ఇంతవరకు అందని మిగిలిన లబ్దిదారులకు జూలై ప్రారంభంలో నిధులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండో విడతగా 4,45,304 మందికి మొత్తం రూ.261 కోట్లు విడుదల చేయనున్నారు. నిధుల విడుదలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. లబ్దిదారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమయ్యే విధంగా ఆధునిక బ్యాంకింగ్ సిస్టమ్ ఉపయోగిస్తున్నారు.
ఎవరెవరు అర్హులు?
ఈ పథకానికి అర్హత పొందాలంటే లబ్దిదారుడి వద్ద ఉపాధిహామీ పథకం (NREGS) జాబ్ కార్డు ఉండాలి. అంతేకాక, కనీసం 20 పనిదినాలు పూర్తి చేసి ఉండాలి. భూమిలేని వ్యవసాయ కూలీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా లబ్దిదారులకు ఆర్థిక భద్రత కలుగుతుండటంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Kaleshwaram Project : ‘కాళేశ్వరం’ లేకుండానే రికార్డు సృష్టించాం – ఉత్తమ్